మైసూర్ సాండల్ సబ్బు భారతీయ చరిత్రలో అంతర్భాగం. వందేళ్ల కంటే ముందే స్వదేశంలో తయారైన అత్యంత నాణ్యమైన సబ్బుగా . మన వారసత్వ సంపదకు నిదర్శనంగా మైసూర్ సాండల్ ఉంది. గంధం వాసనతో మైసూర్ సాండల్ అద్భుమైన సువాసనలు వెదజల్లుతు భారతీయుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దీని కథ ఇది:
మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా భారీ ఎత్తున మిగిలిపోయిన గంధపు చెక్కలను ఎలా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మైసూర్ సామ్రాజ్యాన్ని పాలించే రాజా కృష్ణరాజా వడియార్-4 వచ్చిన ఆలోచనే మైసూర్ శాండల్ సబ్బులు.
మైసూర్ రాజు ఈ సబ్బుల పరిశ్రమ స్థాపన బాధ్యతను దేశంలోనే నంబర్ 1 ఇంజినీర్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు అప్పగించాడు.
అయితే విశ్వేశ్వరయ్య ఈ సబ్బుల తయారీ కోసం బాంబేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్‌కు స్వాగతం పలికారు. యువ ప్రతిభావంతుడైన సోలే గరలపూరి శాస్త్రిని ఇంగ్లండ్ పంపి సబ్బుల తయారీ పరిశీలించి రావాలని పురమాయించారు. విశ్వేశ్వరయ్య కలను సాకారం చేయడంలో గరలపూరి ఎంతో కీలకపాత్ర పోషించారు.
ఎంతో వేగంగా బెంగళూరులోని కేఆర్ సర్కిల్లో 1918లో సోప్ తయారీ మొదలు కావడమే కాదు.. అదే ఏడాది మైసూర్ సాండల్ సబ్బులను ఉత్పత్తి చేశారు. మార్కెట్లోకి వచ్చాక మైసూర్ శాండల్కు విశేష ఆదరణ దక్కింది.
1944లో శివముగ్గలో మరో యూనిట్‌ను నెలకొల్పారు. ఆ తర్వాత సబ్బు రూపు, ప్యాంకింగ్ను శాస్త్రి మరింత ఆకర్షణీయంగా చేశారు.
1980నుంచి ఈ రెండు కంపెనీలను కలిపి పిలవడం చేస్తున్నారు. దీన్ని ‘కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్’గా మార్చి ప్రభుత్వం టేకోవర్ చేసి జాతీయం చేసింది.
ప్రపంచంలోనే 100శాతం శుద్ధమైన నాణ్యమైన చందనం ఆయిల్‌తో తయారు చేసిన సోప్ ‘మైసూర్ సాండల్’. మనం ఈ సోప్ మీద చూసే లోగోను ‘శరభా’ అంటారు. సింహం శరీరం, ఏనుగు తలతో ఉంటుంది. ఇది ధైర్యానికి, బుద్దికి, బలానికి సంకేతంగా భావిస్తారు.
2006లో మైసూర్ సాండిల్ సోప్‌కు జియోగ్రాఫికల్ ట్యాగ్ గుర్తింపు లభించింది. 85శాతం మైసూర్ సాండిల్ సబ్బులు ప్రస్తుతం కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులోనే అమ్ముడవుతున్నాయి.