హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో 15చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 15 బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు ప్రముఖ పారిశ్రామికవేత్త మాలినేని సాంబశివరావు ఇంటితోపాటు పలువురి ఇండ్లలో సోదాలు చేస్తున్నారు.
మాలినేని సాంబశివరావు కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రాటెక్, ట్రాన్స్ ట్రై పవర్ ప్రాజెక్ట్, ట్రాన్స్ ట్రై రోడ్ ప్రాజెక్టులకు మాలినేని సాంబశివరావు డైరెక్టర్ గా ఉన్నారు. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఈ సంస్థలు ఎగ్గొట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు కూడా అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..