దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) విచారణకు రావాలని నోటీసులు పంపించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో మొదటి నుంచి ట్విస్టులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈడీ.. ఎమ్మెల్సీ కవిత(MLC Kavita)కు నోటీసులు పంపించింది. ఈ సందర్బంగా రేపే విచారణను రావాలని నోటీసుల్లో పేర్కొనడం గమనార్హం. అయితే, ఈ కేసులో అరుణ్ రామచంద్రపిళ్లై(Arun Ramachandrapillai) నిన్ననే(బుధవారం) అప్రూవర్‌గా మారారు. ఈ విషయంలో ఆయన ప్రత్యేక జడ్జి ఎదుట వాంగ్మూలం ఇవ్వగా దాన్ని ఈడీ అధికారులు రికార్డు చేసినట్లు సమాచారం. లిక్కర్ స్కాం కేసులో గత ఏడాది మార్చి 7న అరుణ్ రామచంద్ర పిళ్లై(Arun Ramachandrapillai)ని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన నుంచి పలు అంశాలు రాబట్టారు.
ఈ విచారణ సమయంలోనే అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. పిళ్లై వాంగ్మూలం ఆధారంగా విచారణకు రావాలంటూ కవితకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఆమెను విచారించారు. ఈ ఏడాది మార్చి 11వ తేదీన ఈడీ ఎదుట కవిత విచారణకు హాజరయ్యే సమయంలో పిళ్లై తన నిర్ణయం మార్చుకున్నారు. ఈడీ అధికారులు తనపై ఒత్తిడి చేసి కవిత పేరు చెప్పించారంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ కొనసాగుతుండగానే తాజాగా ఆయన మరోసారి అప్రూవర్‌గా మారినట్లు తెలిసింది.