దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో శ్రీరంగం ఆలయం ఒకటి. శనివారం తెల్లవారుజామున తిరుచిరాపల్లిలోని శ్రీరంగంలో ఉన్న అరుల్మిగు రంగనాథస్వామి ఆలయం స్వల్పంగా దెబ్బతింది. ఇవాళ (శనివారం) తెల్లవారుజామున తూర్పు గోపురంలోని ఓ చిన్న భాగం కూలిపోయిది. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న ఆలయాధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. శిథిలాలను అక్కడి నుంచి తొలగించారు. ఆలయ నిర్మాణాల్లో పలు చోట్ల పగుళ్లు వచ్చినట్లు గతంలోనే తాము అధికారులకు ఫిర్యాదు చేశామని స్థానికులు కొందరు చెప్పారు. గోపురం పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు రూ.98 లక్షలు ఖర్చు అవుతాయని ఇటీవలే అంచనాలను రూపొందించామని, ఈ లోపే ఇలా జరిగిందని ఓ సీనియర్ అధికారి చెప్పారు.
ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆలయ నిర్మాణాల్లో పలు చోట్ల పగుళ్లు వచ్చినట్లు గతంలోనే తాము అధికారులకు ఫిర్యాదు చేశామని స్థానికులు కొందరు చెప్పారు. గోపురం పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు రూ.98 లక్షలు ఖర్చు అవుతాయని ఇటీవలే అంచనాలను రూపొందించామని, ఈ లోపే ఇలా జరిగిందని ఓ సీనియర్ అధికారి చెప్పారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగంలో ఆలయ నిర్మాణం వైవిధ్యంగా ఉంటుంది. 155 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆలయంలో మొత్తం 81 మందిరాలు, 21 గోపురాలు, 39 మండపాలు ఉన్నాయి.