పంద్రాగస్టు వేడుకలు రాకముందే కర్నూలులో సంబరాలు అంబరాన్ని అంటాయి. కర్నూలు జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. దేశ స్వాతంత్ర కోసం పోరాటంలో అమరులైన త్యాగశీలులను స్మరించుకుంటూ.. వారి త్యాగ ఫలితమే నేడు భారతదేశం స్వతంత్ర్య దేశంగా అవతరించిందని.. దేశ పోరాటంలో అమరులైన పోరాట యోధులను తలుచుకుంటూ వారి జీవిత చరిత్రకు సంబంధించి.. దేశ పోరాటంలో వారు చేసిన కృషిని నాటకాల రూపంలో విద్యార్థులు ప్రదర్శించారు.
ఇందులో భాగంగానే కర్నూల్ పట్టణంలోని ఏ క్యాంప్ మాటేశ్వరి పాఠశాలలో విద్యార్థులు జెండాను ప్రదర్శించిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. కర్నూల్ పట్టణంలోని ఏ క్యాంప్ మాటేశ్వరి పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాజ్యోతి ఆధ్వర్యంలో సుమారు 2వేల మంది పాఠశాల విద్యార్థులు త్రివర్ణ పతాకంలోని మూడు రంగులకు సంబంధించిన దుస్తులను ధరించి జెండా రూపాన్ని ప్రదర్శించారు. ఏ క్యాంప్ లోని మోంటెసరి పాఠశాలలో ఉన్నటు వంటి మైదానంలో విద్యార్థులు ప్రదర్శించిన జెండాను చూసేందుకు రెండు కళ్ళు చాలవు అన్నట్టుగా త్రివర్ణ పతాకం కనువిందు చేసింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ… తమ పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు.. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ముందుకు సాగాలని తెలుపుతున్నామన్నారు. అదే విధంగా పాఠశాలల్లోని LKG, UKG, ఒకటో తరగతి విద్యార్థులకు అమరవీరుల వేషధారణలు వేయించి.. వారితో కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయించి అందులో అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నామని తెలిపారు.
పాఠశాలలో సుమారు 2000 మంది విద్యార్థులు పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకంలోని మూడు రంగుల ధరించి జెండాను ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను దేశ స్వాతంత్రంలో అమరులైన వారిని పూర్తిగా తీసుకొని ముందుకు సాగే విధంగా ప్రోత్సహిస్తామన్నారు.