పీసీసీ మాజీ అధ్యక్షుడు(FORMER PCC), మాజీ మంత్రి(EX MINISTER) డి.శ్రీనివాస్(D.SRINIVAS) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని(HYDERABAD) ఆస్పత్రికి(HOSPITAL) తరలించారు. ప్రస్తుతం డి.శ్రీనివాస్ ఐసీయూ(ICU)లో చికిత్స పొందుతున్నాడు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. డీఎస్ గతంలో బ్రెయిన్ స్ట్రోక్(BRAIN STROKE)కు గురై పక్షవాతానికి(PARALYSIS) గురయ్యారు. అయితే దీంతో డి.శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని, ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డీఎస్ ఆరోగ్య పరిస్థితి(HEALTH CONDITION)పై పార్టీ శ్రేణులు(PARTY LEADERS) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న నాయకుడు డి.శ్రీనివాస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(ANDHRA PRADESH)గా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేయడమే కాకుండా ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పీసీసీ అధ్యక్ష పదవిలో డీఎస్ పాత్ర కీలకమనే చెప్పాలి. అప్పట్లో డీఎస్ పేరు కూడా సీఎం అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చింది. తెలంగాణ ఏర్పడిన కొద్దిరోజులకే సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు డీఎస్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్‌లో డీఎస్‌కు కేసీఆర్ పెద్దపీట వేశారు. కొద్ది కాలానికే రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ అధినాయకత్వం, డీఎస్ మధ్య విభేదాల కారణంగా టీఆర్‌ఎస్ పార్టీకి డి.శ్రీనివాసరావు దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఆరోగ్యం విషమించడంతో సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు. డీఎస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే వార్తలతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.