ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ డ్రింక్స్‌లో టీ కూడా ఒకటి. కొందరికి టీ తాగకపోతే వారికి ఏం తోచదు. తలనొప్పిగా ఉంటుంది. అన్నం తినకపోయినా పర్లేదు. టీ కావాలని అడుగుతారు. టీ తాగితే మంచిదని కొందరు అంటే.. మరికొంతమంది టీని లిమిటెడ్‌గా తీసుకోవాలని చెబుతున్నారు. కానీ, ఇది నిజానికి అంత మంచిది కాదు. దీనిని తాగడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవేంటో తెలుసుకోండి. టీ తాగడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌లో బాడీలో ఐరన్‌ని గ్రహించకుండా చేస్తుంది. జర్నల్ ఫుడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్‌లో ప్రచురించబడిన ఓ అధ్యయనం ప్రకారం.. టీలో టానిన్లు అని పిలిచే సమ్మేళనాలకి గొప్ప మూలం. మీ జీర్ణవ్యవస్థని ఎఫెక్ట్ చేస్తుంది. ఐరన్ లోపం కారణంగా రక్తహీనత దారితీస్తుంది.
సాధారణంగా టీలో కొన్ని టానిన్లు కొన్ని పోషకాలను శరీరాన్ని గ్రహించడాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. దీని వల్ల ఆందోళన, నిద్ర సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలొస్తాయి. వీటితో పాటు మరి కొన్ని సమస్యలు కూడా వస్తాయి.ఫిన్ ఎక్కువగా ఉన్న టీ తాగితే గర్బధారణ సమయంలో సమస్యలు వస్తాయి. ఇది గర్భస్రావం నుండి బరువు తగ్గడం వంటి సమస్యలకి కారణమవుతుంది. కెఫిన్ ఉన్న టీ తీసుకుంటే గుండెల్లో మంట సమస్యకి కారణమవుతుంది. కెఫీన్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంటకి కారణమవుతుంది. కాబట్టి, ఎక్కువగా తాగకపోవడమే మంచిది.
టీలో సహజంగా కెఫిన్ ఉంటుంది. టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు నిద్ర సమస్యలొస్తాయి. కెఫిన్ మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. మెలటోనిన్ అనేది మీ మెదడకు నిద్ర పోయేందుకు హెల్ప్ చేసే హార్మోన్. కాబట్టి.. ఎక్కువగా తాగడం వల్ల నిద్ర సమస్యలొస్తాయి. దీని వల్ల మానసిక, శారీరక సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి, రోజుకి 2 నుంచి 3 కప్పుల కంటే ఎక్కువగా టీ తాగొద్దు.