ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్. వీటిలో టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ టైటిల్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం గేమ్ ఛేంజర్ ఒకటి. కాగా రెండోది కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఇండియన్ 2. ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఆగస్టు 17న శంకర్ బర్త్ డే. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ సెట్స్‌లో శంకర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించింది దిల్ రాజు టీం. రాంచరణ్, దిల్ రాజు, ఇతర చిత్రయూనిట్ సభ్యులు శంకర్‌తో బర్త్ డే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. బేగంపేట్‌కు సమీపంలో గేమ్ ఛేంజర్ షూటింగ్ కొనసాగుతున్నట్టు సమాచారం.
ఆర్‌సీ15 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్‌లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. రాజోలు భామ అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తు్న్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన గేమ్ ఛేంజర్ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. గేమ్ ఛేంజర్ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథ అందించగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు.
శంకర్-కమల్ హాసన్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2 స్పెషల్ లుక్‌ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేయగా.. నెట్టింట ట్రెండింగ్ హల్ చల్ చేస్తోంది. పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తుండగా..బాబీ సింహా, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇండియన్ 2 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.