శరీరంలోని ఇంపార్టెంట్ ఆర్గాన్స్‌లో కిడ్నీలు కూడా ఉంటాయి. అవి సరిగ్గా పని చేయగలిగితేనే మనం సరిగ్గా పని చేయగలుగుతాం. కిడ్నీలు రక్తంలోని మలినాలను వడకట్టి, పనికిరాని వాటిని పక్కకి తీసేసి, బాడీలో ఫ్లూయిడ్ బాలెన్స్ ని మెయింటెయిన్ చేస్తాయి. ఎక్కువగా ఉన్న నీటిని బ్లాడర్ లోకి పంపించి యూరిన్ రూపంలో బయటికి పంపిస్తాయి. అయితే, ఏ కారణం చేతనైనా కిడ్నీలు సరిగా పని చేయకపోతే, అక్కర్లేని వాటిని బయటికి పంపించలేకపోతే కిడ్నీల్లో క్రిస్టల్స్ ఏర్పడుతాయి. వాటినే కిడ్నీల్లో రాళ్ళు అంటూంటాం. ఈ రాళ్ళు చిన్నవీ, పెద్దవీ ఉంటాయి. చిన్న వాటిని ఈజీగానే క్యూర్ చెయ్యచ్చు. ఇక్కడ కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి గల కారణాలూ, లక్షణాలూ, సహజంగా ఈ సమస్యని అధిగమించే పద్ధతులూ ఉన్నాయి.
కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి ముఖ్య కారణం శరీరంలో తగినంత నీరు లేకపోవడం. దాంతో పాటు యూరిన్‌లో ఎక్కువ యాసిడ్ ఉండటం, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్ వంటివి కూడా ఈ సమస్యకి దారి తీస్తాయి. తొందరగా కనుక్కుంటే ఈ ప్రాబ్లమ్‌ని ఈజీగా క్యూర్ చేయొచ్చు. కడుపులో, నడుం కింద భాగం లో నొప్పి, యూరిన్ ఆపుకోలేకపోవడం, ఒక్కోసారి యూరిన్ లో బ్లడ్ పడడం, వికారంగా ఉండడం, వాంతులు కావడం, చెమటలు లేదా చలి…ఇవన్నీ కిడ్నీ లో రాళ్ళు ఉంటే కనిపించే లక్షణాలే. అయితే ఇవన్నీ పరిస్థితి తీవ్రతను బట్టి ఎక్కువగానో తక్కువగానో ఉంటాయి. పైగా ఈ సమస్య ఉన్న ప్రతివారిలోనూ ఈ లక్షణాలన్నీ కనిపించాలన్న రూల్ కూడా లేదు.
కిడ్నీలోని రాళ్లు తగ్గాలంటే.. ఇవి తినాల్సిందే.
రాజ్మా చూడడానికి కూడా కిడ్నీల లాగానే ఉంటాయి. ఇవి కిడ్నీలని క్లెన్స్ చేసి కిడ్నీ లో రాళ్ళని కరిగిస్తాయని అంటారు. రాజ్మా లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు గా ఉన్న మినరల్స్, బీ విటమిన్స్ కిడ్నీలని శుభ్రపరిచి యూరినరీ ట్రాక్ట్ బాగా పనిచేసేలా చేస్తాయి.
యాపిల్ సైడర్ వెనిగర్ లో ఉన్న సిట్రిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ ని కరిగించేందుకు సహాయపడుతుంది. బ్లడ్ లోనూ, యూరిన్ లోనూ ఉన్న యాసిడ్ ని తగ్గించి స్టోన్స్ మళ్ళీ ఏర్పడకుండా చూస్తుంది. రెగ్యులర్ గా యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటూ ఉంటే శరీరం లోని అక్కర్లేని పదార్ధం బైటికి పోతుంది.
దానిమ్మల్లో ఉన్న పొటాషియం వలన దానిమ్మ గింజలు తిన్నా, రసం తాగినా కిడ్నీ స్టోన్స్ నుండి విముక్తి లభిస్తుంది. కిడ్నీలలో ఏర్పడే క్రిస్టల్స్ ఏర్పడకుండా పొటాషియం కాపాడుతుంది. ఇందులో ఉన్న యాస్ట్రింజెంట్ గుణాల వల్ల కిడ్నీల్లో ఉన్న టాక్సిన్స్ బైటికి వెళ్ళిపోతాయి.
డాండలియన్ టీ కిడ్నీలని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. ఈ టీ కిడ్నీలకి టానిక్ లాగా కూడా పని చేస్తుంది. అరుగుదలకు తోడ్పడి అక్కర్లేని వాటిని బైటికి పంపడంలో ఉపకరిస్తుంది.