ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM Jagan) శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)తో పాటు హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఢిల్లీ వెళ్లాలనుకున్నారు. కానీ అప్పట్ల అపాయింట్‌మెంట్లు ఖరారు కాకపోవడంతో వెళ్లలేదు. ఈ సారి ఖరారు కావడంతో ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని చెబుతున్నారు. సీఎం జగన్ (CM Jagan)రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో ఉండే అవకాశం ఉంది. ఏపీలో ముందస్తు ఎన్నికలపై కొంత కాలంగా చర్చజరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సైతం.. అక్టోబర్ నెలలోనే వస్తుండటం.. అది కూడా ఆరు నుంచి ఏనిమిదో తేదీ మధ్యన రిలీజ్ కావొచ్చనే సమాచారం వస్తున్న క్రమంలోనే.. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్(Delhi tour) షెడ్యూల్ ఖరారు కావడంతో మరోసారి చర్చ ప్రారంభమయింది.
అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలంటే ముందు అసెంబ్లీని రద్దు చేయాలి. నోటిఫై చేయాలి. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈసీ స్వయంగా పర్యటించి సంతృప్తి చెందాలి. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తారు. ఇవాళ అసెంబ్లీ రద్దు చేసి.. రేపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం అనేది సాధ్యం కాదని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ వార్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండిస్తూ వస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఏపీలో ఎన్నికల 2024 ఏప్రిల్ నెలలో జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఏడు నెలల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు(TDP leader Chandrababu)ను అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది. ఇలాంటి సమయంలో జగన్ ఢిల్లీకి వెళ్లి మోదీ, అమిత్ షాలతో భేటీ అవుతుండటంతో.. ఎన్నికలతోపాటు చంద్రబాబు అరెస్టు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. చంద్రబాబు అరెస్టుకు దారి తీసిన పరిణామాలు, శాంతిభద్రతల పరిస్థితుల గురించి ప్రధాని మోదీకి సీఎం జగన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.