ఢిల్లీ(DELHI) స్పెషల్ సెల్(SPECIAL CELL) పోలీసులు(POLICE) కీలక ముందడుగు వేశారు. ఇస్లామిక్ స్టేట్(ISLAMIC STATE) అనుమానిత కరుడుగట్టిన ఉగ్రవాది(TERRORIST) మహ్మద్ షానవాజ్(MOHAMMED SHAHNAWAZ) అలియాస్ షఫీ ఉజ్జమాతో పాటుగా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) లోగడే ప్రకటించింది. అతడి తలపై రూ.3 లక్షల రివార్డు(3 LAKHS REWARD) ఉంది. పూణే ఐసిస్ మాడ్యూల్ కేసులో ఎన్ఐఏ వాంటెడ్ లిస్ట్(WANTED LIST) లో ఉన్నాడు. పూణే పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న అతడి కోసం ఎప్పటి నుంచో వేట కొనసాగుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరిని కూడా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉగ్రవాదులు దేశ రాజధానిలో ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా దేశవ్యాప్తంగా ఉగ్రవాద లింకులున్న వ్యక్తులను పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసుల విభాగం ఎన్ఐఏతో కలిసి పనిచేస్తుంది.
ఢిల్లీకి చెందిన షఫీ ఉజామా వృత్తి రీత్యా ఇంజనీర్. పూణే(PUNE) కేసులో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న అతడు ఢిల్లీలో తలదాచుకుంటున్నాడు. విదేశాల్లోని వారి ఆదేశాలకు అనుగుణంగా ఉత్తరాదిన ఉగ్రదాడులకు పన్నాగం పన్నినట్టు పోలీసులు తెలుసుకున్నారు. ఐఈడీ(IED)ల తయారీలో వినియోగించే పలుడు పేలుడు పదార్థాలను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. షఫీ ఉజామా, మరో ఇద్దరిని పుణె మాడ్యూల్ కేసులో కొత్రూడ్ పోలీసులు జూలై 18న అరెస్ట్ చేశారు. పోలీసు వాహనం నుంచి షఫీ కిందకు దూకేసి తప్పించుకోగా, ఇన్నాళ్లకు మళ్లీ చిక్కాడు. షానవాజ్‌తో సహా ముగ్గురు ఉగ్రవాద అనుమానితులను ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు.