తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దీప్తి(Software Engineer Deepti)(24) మిస్టరీ కేసు వీడింది. తన అక్కను తానే చంపినట్లు దీప్తి చెల్లెలు చందన(Sister Chandana) ఒప్పుకుంది. తాను ప్రేమించిన వాడు ఇతర మతస్థుడు కావడంతో ఒప్పుకోలేదని అక్క దీప్తి ముక్కు, మూతికి ప్లాస్టర్ వేసి చంపినట్లు చెప్పింది. అయితే ఈ హత్యకు చందన ప్రియుడు(Chandhana Lover) సహకరించాడు. అంతేకాకుండా చందన ప్రియుడి తల్లికూడా హత్యకు సహకరించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ కేసులు సంబంధించి పూర్తి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులను ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీసులు పట్టుకున్నారు. ఇందులో దీప్తి సోదరి చందన, ఆమె స్నేహితుడు, డ్రైవర్‌గా భావిస్తున్న మరో వ్యక్తి ఉన్నారు.
దీనికంటే ముందు పోలీసులు చందన తన తమ్ముడికి పంపిన వాయిస్ మెసేజ్ ను గుర్తించారు. ఈ మెసేజ్ ఆధారంగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఆ వాయిస్ మెసేజ్ లో… ‘అరేయ్ సాయి నేను చందక్కనురా, నిజమెంటో చెప్పాలారా. దీప్తిక్క నేను తాగుదామనుకున్నాం. కానీ, నేను తాగలేదు. అక్కనే తాగింది. నేను నా ఫ్రెండ్ చేత తెప్పించా. అది నేను ఒప్పుకుంటా. కానీ, అక్కనే తాగింది. తాగిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ను పిలుస్తా అంది. నేను వద్దన్నా.. అయినా పిలుస్తా అంటే చివరికి నీ ఇష్టం సరే అన్నా. నేను ఇంట్లోంచి వెళ్లిపోదాం అనుకున్నాం. అది నిజం. అక్కకి చెప్పి వెళ్లిపోదాం అనుకున్నాం. అక్క హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. ఫోన్ మాట్లాడి.. సోఫాలో పడుకుంది. రెండుసార్లు లేపాను. సరే పడుకుందని డిస్టర్బ్ చేయొద్దని వెళ్లిపోయా. ఛాన్స్ దొరికిందని వెళ్లిపోయిన. నా తప్పేం లేదు సాయి. నాకు అక్కను చంపే ఉద్దేశం లేదు.. నన్ను నమ్ము సాయి, నా తప్పేం లేదు ప్లీజ్ నమ్మురా. మేం రెండు బాటిల్స్ తెప్పించుకున్నాం. నేను బ్రీజర్ తాగా. అక్క వోడ్కా తాగింది. తర్వాత నాకు ఏమైందో తెలీదు. నేనైతే వెళ్లిపోయిన ఇట్లా అయితదనుకోలేదు. నేనెందుకు చంపుతా సాయి, నేనేందుకు మర్డర్ చేస్తా.’ అని ఉంది. తాను మర్డర్ చేయలేదని వాయిస్ మెసేజ్ లో చెప్పినా కూడా పోలీసులు నమ్మలేదు. తనదైన శైలిలో లోతైన దర్యాప్తు చేపట్టి నిజాన్ని వెలికి తీశారు.