బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే గతంలో హాలీవుడ్ లో సందడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ అనే సినిమాలో ఆమె సందడి చేశారు. ఆ సమయంలో ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె విన్ డీజిల్ తో కలిసి ఫోటోలు కూడా దిగారు. వీరిద్దరూ కలిసి ఓ ఆటో కూడా ఎక్కారు. ఆయన ఇండియా వచ్చిన సందర్భంలో ఈ ఫోటోలు దిగినట్లు సమాచారం.
దీపికా పదుకొణే తొలిసారిగా హాలీవుడ్‌లో నటించిన ‘ట్రిపులెక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. హాలీవుడ్ యాక్షన్ స్టార్ విన్ డీజిల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 346 మిలియన డాలర్లు (సుమారు రూ. 2200 కోట్లు) వసూలు చేసింది. ఈ మూవీ దీపికాకు మంచి క్రేజ్‌ను తీసుకొచ్చింది. తాజాగా ఆ త్రో బ్యాక్ ఫోటోలను విన్ డీజిల్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దీంతో ఆయన షేర్ చేసిన ఫోటోలకు ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. ఈసారి నిజంగా ఆయనను ఆటో నడపమని కోరుతుండటం విశేషం. తన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ లో భాగంగా వస్తున్న నెక్ట్స్ సినిమాలో ఆటో నడపమని ఫ్యాన్స్ కోరడం విశేషం. ఇప్పుడు ఫ్యాన్స్ కోరిన కామెంట్స్ వైరల్ గా మారాయి.