స్వప్న లోక్ అగ్ని ప్రమాద ఘ్టనతో బయటికి వచ్చిన Q మార్ట్ మోసాలను దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరో ముఠా పట్టుబడిందని తాజాగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఢిల్లీ, ఘజియాబాద్ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు నడుపుతుందని చెప్పారు. వనమూలికలతో ఔషధాలు, ఇతర ఉత్పత్తుల పేరిట ఈ ముఠా దేశం మొత్తమ్మీద దాదాపు 7 వేల మందికి టోకరా వేసిందని వెల్లడించారు. నెలవారీ చెల్లింపుల పేరిట అమాయకులకు గాలం వేసి కోట్లు వసూలు చేశారని వివరించారు. వారి వద్ద నుంచి ఏకంగా రూ.200 కోట్ల వరకు వీళ్లు దోచుకున్నారని షాకింగ్ వివరాలు బయటపెట్టారు. చట్ట ప్రకారం.. మల్టీ లెవల్ మార్కెటింగ్, పిరమిడ్ స్కీమ్‌లు నేరమన్నారు. అయితే.. ఈ ముఠా సభ్యులు హెర్బల్ ప్రాడక్ట్స్ పేరుతో, అమాయకుల్ని మోసం చేశారని, వారి నుంచి దారుణంగా భారీ మొత్తం దోచుకున్నారని చెప్పారు. ఇందుకోసం పలు పేర్లతో స్కీమ్ లు కూడా పెట్టారని తెలిపారు.
నెలవారీ చెల్లింపుల పేరిట అమాయకులకు గాలం వేసి కోట్లు వసూలు చేశారని వివరించారు. ఇందుకోసం పలు పేర్లతో స్కీమ్ లు కూడా పెట్టారని తెలిపారు. పర్ఫెక్ట్ హెర్బల్ స్టోర్ పేరుతో ఉన్న స్కీమ్ ప్రకారం రూ.6 లక్షలు కట్టిన వారికి 30 నెలల పాటు నెలకు రూ.30 వేలు చెల్లిస్తామని ఆశ చూపారు. పర్ఫెక్ట్ బజార్ పేరుతో ఉన్న మరో స్కీమ్ ప్రకారం రూ.25 లక్షలు కట్టిన వారికి 36 నెలల పాటు నెలకు లక్ష రూపాయలు ఇస్తామని ప్రలోభపెట్టారు. ఐడీ స్కీమ్ అని మరొకటి ఉంది. దీంట్లో రూ.9,999 కడితే 36 నెలల పాటు రూ.888 చొప్పున ఇస్తామని నమ్మించారన్నారు. పర్ఫెక్ట్ బజార్ పేరుతో ఉన్న మరో స్కీమ్‌లో 25 లక్షలు కడితే.. నెలకు రూ.1లక్ష చొప్పున 36 నెలలు ఇస్తామని నమ్మబలికారని అన్నారు. ఇవే కాకుండా… హిల్ స్టేషన్ టూర్, ల్యాప్‌టాప్స్, బైక్స్, జ్యువెలరీ, ఫ్లాట్, కార్లు బహుమతిగా ఇస్తామని కూడా ప్రకటనలు ఇచ్చారన్నారు. వీరిచ్చిన ఈ ప్రకటనల పట్ల ఆకర్షితులై.. జనాలు మోసపోయారన్నారు. వీరి ప్రకటనలు ఆకర్షణీయంగా ఉండడంతో జనాలు భారీగా డబ్బులు కట్టి స్కీమ్ లలో చేరారు. క్యూ మార్ట్ మోసాల కేసు దర్యాప్తు చేస్తుంటే, ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ స్కాం బయటపడింది. ఈ కేసులో ఇప్పటివరకు బాబీ చౌదరి, రియాజుద్దీన్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశాం. పూజా కుమారి, షకీలా అనే మహిళలు పరారీలో ఉన్నారు” అని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వివరించారు.