మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం(STATE GOVERNMENT) అనేక పథకాలు చేపడుతోంది. ఇది ప్రజల జీవితాన్ని సులభతరం చేయడానికి చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం(TELANGANA GOVERNMENT) త్వరలో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్(NATIONAL MOBILITY CARD)ను ప్రారంభించనుంది. హైదరాబాద్(HYDERABAD) నగర ప్రజా రవాణా వ్యవస్థలో ఇది ఒక పెద్ద ముందడుగు కానుంది. మెట్రో రైలు(METRO TRAIN), ఎంఎంటీఎస్(MMTS), ఆర్టీసీ బస్సుల్లో(RTC BUSSES) ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించేందుకు వీలుగా ఈ కార్డును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలో మీరు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ద్వారా షాపింగ్ చేయడానికి ఉపయోగించే బ్యాంక్ కార్డ్‌తో మెట్రో రైలు(METRO TRAIN)లో ప్రయాణించగలరు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎల్ అండ్ టీ(L&T) హైదరాబాద్ మెట్రో రైల్(HYDERABAD METRO RAIL) కంపెనీ పూర్తి చేయనుంది. స్టేషన్లలో ఇప్పటికే కార్డ్ రీడర్‌లను ఏర్పాటు చేశారు. ఈ కార్డులు అందుబాటులోకి వచ్చాక ముందుగా.. మెట్రో, ఆ తర్వాత ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు, ఎంఎంటీఎస్, పార్కింగ్ తదితర వాటిని వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా.. షాపింగ్, ఆన్‌లైన్ లావాదేవీలకు బ్యాంక్ కార్డ్ ఉపయోగపడుతుంది.
NCMC కార్డ్ ఇప్పటికే ఉన్న మెట్రో స్మార్ట్ కార్డ్ లాగా పనిచేస్తుంది. మెట్రో స్మార్ట్ కార్డ్ మెట్రోలో మాత్రమే చెల్లుతుంది. NCMC కార్డ్ అన్ని ప్రయాణాలకు చెల్లుబాటు అవుతుంది. షాపింగ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. రూ.100 నుంచి రూ.2 వేల వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. మెట్రో స్టేషన్లలో ఎక్కడైనా ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కార్డులను NCMC అందించే బ్యాంకుల నుండి కూడా పొందవచ్చు. బ్యాంకులు వీటిని రూపే కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులుగా అందిస్తున్నాయి. SBI, ICICI, ఇండియన్ బ్యాంక్ మరియు Paytm వాలెట్ కంపెనీలు వంటి బ్యాంకులు దేశవ్యాప్తంగా వివిధ మెట్రోలలో NCMC కార్డులను అందిస్తున్నాయి. Paytm త్వరలో హైదరాబాద్ మెట్రోలో వాలెట్ ట్రాన్సిట్ కార్డ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. కార్డు కోసం రూ.250 చెల్లించాలి. కార్డు ఖరీదు రూ.150 కాగా నగదు రూపంలో రూ.100. తెలంగాణ ప్రభుత్వం ముందుగా హైదరాబాద్ మెట్రో వరకు ప్రయోగాత్మకంగా ఈ కార్డును జారీ చేయనుందని, త్వరలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు చర్యలు తీసుకోనుంది.