తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. సీఎం కేసీఆర్ వచ్చే శనివారం నాడు మెదక్ జిల్లాలో పర్యటించి జిల్లా కలెక్టరేట్ భవనం, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ మరుసటి రోజు సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ సందర్భంగా మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌తో పాటు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అలాగే బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సైతం ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్నారు. 20న సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో సూర్యాపేట కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీకి సైతం ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి, బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా, జిల్లాలో కొత్తగా నిర్మించిన వైద్య కళాశాల కూడా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోనుంది.