తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ఐదుగురు వైద్యుల బృందం వైద్యం ఆయనకు చికిత్స అందిస్తోంది. తన తండ్రి కేసీఆర్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వారం రోజుల నుంచి జ్వరం, దగ్గు సమస్యలతో కేసీఆర్ చికిత్స తీసుకుంటున్నారు. ఇంట్లోనే డాక్టర్లు కేసీఆర్ కు చికిత్స అందిస్తున్నారని.. త్వరగానే ఆయన కోలుకుంటారని డాక్టర్ల బృందం చెప్పినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
సీఎం కేసీఆర్ కు అనారోగ్యం అని తెలియగానే బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. వారం రోజుల నుంచి వైరల్ ఫీవర్ అని తెలియగానే షాక్ అవుతున్నారు. తమ అభిమాన నేత అనారోగ్యం బారిన పడిన వారం రోజుల తరువాత ఈ వార్త కేటీఆర్ ద్వారా బహిర్గతం అయింది. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని తెలంగాణ మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు.