ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), వైఎస్సార్సీపీ(YSRCP) నాయకులపై ఎంపీ రఘురామకృష్ణరాజు(MP Raghuramakrishna Raju) విరుచుకుపడ్డారు. పీవీ రమేష్ మాట్లాడిన మాటలకు జగన్ షాక్ అవ్వగా.. వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిసిపోయాయని ఎద్దేవా చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన ఒరిజినల్ ఫైళ్లన్నీ వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలే దొంగిలించారని ఆయన ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కావాలనే చంద్రబాబు నాయుడ్ని జగన్ ప్రభుత్వం(Jagan Government) ఇరికించిందని రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు వ్యవహారమంతా సజ్జల రామకృష్ణ రెడ్డి వెనకుండి నడిపిస్తున్నారని దుయ్యబట్టారు.
”ఆ దేవుడే దిగివచ్చి చెప్పినా నేను తప్పు చేయనని, రాజకీయ ఒత్తిళ్లకు లొంగనని ఈరోజు పీవీ రమేష్ మాట్లాడిన మాటలకు.. జగన్ షాక్ అయితే.. వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిసిపోయాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన ఒరిజినల్ ఫైల్స్‌ని ఎవరు దొంగిలించారు..? అనే విషయంలో అనుమానమే అక్కర్లేదు.. కచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వమే దొంగిలించింది. అసలు ఫైల్ లేకుండా కేసు ఎలా పెడతారు..?. చంద్రబాబు నాయుడిపై పెట్టిన కేసులన్నీ డొల్ల కేసులే. ఈ కేసుల వల్ల వైసీపీ ప్రభుత్వం గుల్లైపోతుంది. ప్రజా నాయుకుడైన చంద్రబాబు కోసం రాష్ట్ర ప్రజలందరూ ఓ సైన్యంగా నిలబడతారు” -ఎంపీ రఘురామకృష్ణరాజు