Monday, December 23, 2024
Home ఆంధ్రప్రదేశ్ CM Inagurated 5Medical Colleges: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం..

CM Inagurated 5Medical Colleges: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం..

by స్వేచ్ఛ
0 comment 68 views
CM JAGAN INAGURATED MEDICAL COLLEGES

ఆంధ్రప్రదేశ్‌(ANDHRA PRADESH) రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల(MEDICAL COLLEGES)ను ముఖ్యమంత్రి(CHIEF MINISTER) వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి(YS JAGAN MOHAN REDDY) ప్రారంభించారు. విజయనగరం(VIJYANAGARAM) మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి సీఎం జగన్ వర్చువల్‌(VIRTUAL)గా ప్రారంభించారు. విజయనగరం, రాజమండ్రి(RAJAHMUNDRY), ఏలూరు(ELLURU), మచిలీపట్నం(MACHILIPATNAM), నంద్యాల(NANDYALA)లో మెడికల్ కాలేజీలను సీఎం ప్రారంభించారు. అనంతరం విజయనగరం వైద్య కళాశాలలో ఫొటో ఎగ్జిబిషన్‌(PHOTO EXHIBITION)ను ముఖ్యమంత్రి తిలకించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ(SATYANARAYANA), విడదల రజినీ(VIDADALA RAJINI), ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు ఉన్నారు.

వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏపీ సర్కారు నిర్మించనుంది రూ. 8,480 కోట్ల వ్యయంతో మొత్తం17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతోంది. దీంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య భారీగా పెరుగనుంది. ఇప్పటికే ఉన్న 2,185 ఎంబీబీఎస్ సీట్లకు అదనంగా మరో 2,550 ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నాయి. అనంతరం సీఎం జగన్ ప్రసంగించారు. ఇవాళ 5 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నామని.. మళ్లీ 5 కాలేజీలు,  వచ్చే ఏడాది మరో 7 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. మొత్తంగా 17 కొత్త మెడికల్‌ కాలేజీలు ప్రారంభించబోతున్నామని సీఎం వెల్లడించారు. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్‌కు ఒక మెడికల్ కాలేజీ ఉండబోతోందని ఆయన తెలిపారు. ఏపీలో మొత్తం 28 మెడికల్ కాలేజీలు ఉండబోతున్నాయని.. ఈ కాలేజీల వల్ల కొత్తగా 2,250 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రాబోతున్నాయని సీఎం పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఏపీలో కేవలం 11 మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని.. ఇప్పుడు మరో 17 మెడికల్‌ కాలేజీల కోసం రూ.8480 కోట్లు వెచ్చిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఐదు మెడికల్‌ కాలేజీలు ప్రారంభిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో చాలా మంది గొప్ప డాక్టర్లు కావాలన్నారు.

ఇప్పటి వరకు 2185 సీట్లు అందుబాటులో ఉన్నాయని.. కొత్త కాలేజీల రాకతో సీట్ల సంఖ్య 4735కు చేరిందన్నారు. ఈ ఒక్క ఏడాదే 609 సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. గిరిజన ప్రాంతాల్లోనూ కాలేజీలు వస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో మరో 2737 పీజీ సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో కూడా మెడికల్‌ కాలేజీలు వస్తాయన్నారు. ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. మరో 18 నర్సింగ్‌ కాలేజీలు అందుబాటులోకి తెస్తామని, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని సీఎం తెలిపారు. 

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News