ఏళ్ళు గడుస్తున్నా మనదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే(India) అంటున్నాం తప్ప అభివుద్ది చెందిన దేశం అని ఎప్పుడు అంటామా అని దేశం మొత్తం ఎదురు చూస్తున్నారు. అనేక నిధులు, నిక్షేపాలు, వ్యవసాయం, అపార మేధస్సు ఇదంతా భారతీయ సంపద. ఇవన్నీ మనదేశం సంపూర్ణంగా వినియోగించుకుంటే.. ఎప్పుడే అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేది. కానీ, రాజకీయ నాయకుల స్వలబ్ధి కొరకు అన్నింట్లో అవినీతి చూసుకుంటున్న క్రమంలో దేశం సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించలేకపోతుంది. అనేక పట్టణాలు టెక్నాలజీ(Technology ), రోడ్డు(Road Fecility) సౌకర్యం ఇలా అనేకం అభివృద్ధి చెందుతున్నా.. దేశంలోని కొన్ని మారుమూల గ్రామాల్లో కనీసం రోడ్డు సౌకర్యం కూడా ఉండట్లేదు.
రాజకీయ నేతలు(Politicians) ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారు. ఏళ్ల తరబడి తాము ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన ఓటర్లకు రిక్తహస్తం చూపుతున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రికి తరలించలేని పరిస్థితిలో ఓ బాలిక వైద్యం అందక కన్నుమూసింది. చివరికి బాలిక మృతదేహాన్ని ఖననం చేయడానికి కూడా కుటుంబసభ్యులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న దయనీయ సంఘటన ఇది.
ఏపీలోని అల్లూరి జిల్లా(Alluri District) ముంచింగిపుట్ మండలం లక్ష్మీపురం పంచాయతీ తుమ్మడి పొట్టు తుమ్మిడిపుట్టు గ్రామంలో భాను అనే చిన్నారి అనారోగ్యంతో మృతి చెందింది. మృతదేహాన్ని(Dead Body) ఖననం చేయడానికి.. పొంగుతున్న వాగులో తరలించడానికి చాలా అవస్థలు పడ్డారు. చివరకు ప్రాణాలకు తెగించి గ్రామస్థులందరూ ఒకరినొకరు పట్టుకుని మృతదేహాన్ని తరలించారు. చికెన్ ఫాక్స్ (Chicken Fox)తో రెండు రోజులుగా బాధపడుతున్నా ఆసుపత్రికి తరలించలేని పరిస్థితిలో మృతి చెందిందని ఆవేదన చెందారు. అరకు ఎమ్మెల్యే పాల్గుణ.. వంతెన నిర్మిస్తానని ఓట్లు వేయించుకుని గెలిచి ఇప్పుడు నెరవేర్చలేదని అందుకే ఈ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఓట్లు ఎలా వేస్తామనుకుంటున్నావ్ అని ప్రశ్నించారు. అతి కష్టం మీద మృతదేహాన్ని అవతలి ఒడ్డుకు తరలించి ఖననం చేశారు.