ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నేడు సాగునీటి ప్రోజెక్ట్ లపై యుద్దభేరి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నాగావళి వంశధార అనుసందాన హైలెవిల్ కెనాల్ పరిశీలన చేస్తారు. ఆ తర్వాత హిర మండలం రిజర్వాయర్ ను టీడీపీ నేతలతో కలిసి పరిశీలించనున్నారు. అనంతరం వంశధార నిర్వాసితులతో ముఖాముఖిలో పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఆ తరువాత కొత్తూరు మండలకేంధ్రంలో సాయంత్రం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు.
కాగా , సోమవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించారు. ఈ ప్రాజెక్టును తానే శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వస్తే రూ.2కే యూనిట్ కరెంట్ అందిస్తామని ప్రకటించారు. అధికార వైసీపీ పైతీవ్ర ఆరోపణలు చేస్తూ.. వైసీపీ పాలనలో జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే మండలానికి ఒక వర్క్ స్టేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని స్పష్టం చేశారు. సోలార్ పవర్ తీసుకువచ్చి రూ.2కే యూనిట్ కరెంట్ ఇచ్చేలా చూస్తామన్నారు.