టీడీపీ(TDP) అధినేత(CHIEF) చంద్రబాబు నాయుడు(CHANDRABABU NAIDU)ను ప్రత్యేక భద్రత నడుమ పోలీసులు(POLICE) రాజమండ్రి సెంట్రల్ జైలు(RAJAHMUNDRY CNETRAL JAIL)కి తరలించారు. భారీ వర్షం(HEAVY RAIN) కురుస్తుండటంతో విజయవాడ ఏసీబీ కోర్టు(VIJYAWADA ACB COURT) నుంచి రాజమండ్రి చేరుకోవడానికి 5గంటలకు(5 HOURS) పైగా సమయం పట్టినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు కోసం జైలులోని ‘స్నేహ బ్లాక్’లో(SNEHA BLOCK) ప్రత్యేక గదిని(SPECIAL CELL) అధికారులు సిద్ధం చేసారు. జైలు చుట్టూ 300మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసారు. జైలులో చంద్రబాబుకి అధికారులు ‘ఖైదీ నెంబర్ 7691’ను కేటాయించారు. స్నేహ బ్లాక్‌లోని స్పెషల్ సెల్‌లో ఆయన ఉన్నారు.
కోర్టు ఆదేశాల మేరకు జైలులో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. నేటి నుంచి ఇంటి ఫుడ్(HOME FOOD)ను అందించనున్నారు. అధికారుల నుంచి అనుమతి రావడంతో జైలు లోపలికి వెళ్లిన లోకేశ్(LOKESH).. పేపర్ వర్క్(PAPER WORK) ప్రకియ పూర్తికావడంతో బయటికి వచ్చేసారు. అనంతరం జైలు బయట స్థానికులతో చర్చలు జరిపారు. నేటి ఉదయం చంద్రబాబుతో ములాఖత్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఈ నెల 22వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నారా లోకేష్ నిర్వహిసస్తున్న యువగళం(YUVAGALAM) పాదయాత్ర వాయిదా వేయనున్నారు. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో పాదయాత్ర కొనసాగుతుండగా.. చంద్రబాబు అరెస్ట్ తో లోకేష్ బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు జైలు నుంచి విడుదల అయ్యేవరకు ఈ పాదయాత్రకు బ్రేక్ వేయబోతున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.