స్కిల్ డెవలప్‌మెంట్(SKILL DEVELOPMENT) వ్యవహారంలో అవినీతి చోటు చేసుకుందని పేర్కొంటూ సీఐడీ(CID) పోలీసులు(POLICE) టీడీపీ(TDP) అధినేత(CHIEF) నారా చంద్రబాబు నాయుడను (NARA CHANDRABABU NAIDU) అరెస్టు చేయగా, ఆయనకు ఏసీబీ కోర్టు(ACB COURT) 14 రోజుల రిమాండ్(14 DAYS REMAND) విధించింది. అంటే ఆయన ఈ నెల 22వ తేదీ వరకు జైల్లో(JAIL) ఉండనున్నారు. దీంతో ఆయనను రాజమండ్రి జైలుకు(RAJAHMUNDRY JAIL) తరలిస్తున్నారు. మరోవైపు, రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రత్యేక గదిని(SPECIAL ROOM) కేటాయించాలని ఆదేశించింది. జైలులో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు(SPECIAL FACILITIES) కల్పించాలని స్పష్టం చేసింది. అలాగే, ఆయనకు కావాల్సిన మందులు(MEDICINE), వైద్య చికిత్స(HEALTH TREATMENT) కూడా అందించాలని ఆదేశించింది. చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకొచ్చేందుకు అనుమతించాలని రాజమండ్రి జైలు అధికారులకు నిర్దేశం చేసింది.
కాగా, చంద్రబాబును రాజమండ్రి జైలుకు ఆయన సొంత కాన్వాయ్‌లోనే తరలిస్తున్నారు. కోర్టు నుంచి బయటికి వచ్చిన చంద్రబాబు.. కారులో నిలబడి కార్యకర్తలకు విక్టరీ సింబల్ చూపించారు. ప్రస్తుతం విజయవాడ(VIJYAWADA)లో భారీ వర్షం(HEAVY RAINS) కురుస్తుంది. దీంతో చంద్రబాబు కాన్వాయ్ రాజమండ్రికి చేరుకునేందుకు కనీసం నాలుగు గంటల(4 HOURS)కు పైగా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు వెంట ఆయన కుమారుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(NARA LOKESH) కూడా వెళుతున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు కాన్వాయ్ తో పాటు.. టీడీపీ శ్రేణులు, జర్నలిస్టులు ఉన్నారు. అయితే టీడీపీ కి చెందిన నేతల కార్లు ఈ కాన్వాయ్ లో వచ్చి చేరడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. మధ్యలో ఎవరి కార్లు చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైవే పై బారికేడర్లు పెట్టి వాహనాలను చెక్ చేస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్ తో పాటు లోకేష్, ఇతర టీడీపీ నేతలు ఉన్న వెహికల్స్ ని మాత్రమే అనుమతిస్తున్నారు పోలీసులు.
ఇదిలా వుంటే చంద్రబాబు అరెస్టుకు టీడీపీ సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు ఉత్తర్వులు వెళ్లాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధిస్తున్నట్టు తీర్పు వెలువరించిన అనంతరం… ఇదే కోర్టులో చంద్రబాబు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరుగుతున్నాయి. మరోవైపు, చంద్రబాబును కస్టడీ(CHANDRABABU CUSTODY)కి కోరుతూ సీఐడీ పిటిషన్ వేసింది. వారం రోజుల కస్టడీకి కోరింది. ఈ పిటిషన్‌ను కోర్టు రేపు విచారించే అవకాశం ఉంది.