టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గాంధీ జయంతి రోజున నేడు (అక్టోబర్ 2న) ఆయన కుటుంబం ఒక్కరోజు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు(AP skill development case)లో అరెస్టైన చంద్రబాబు(Chandrababu) రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే సోమవారం నిరాహార దీక్ష(hunger strike) చేయనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ మహాత్ముడి బాటలోనే శాంతియుతంగా నిరసన చేపడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు అక్కడి నుంచే ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తారు.
టీడీపీ ఎంపీ కనకమేడల నివాసంలో లోకేశ్ దీక్ష(Lokesh Diksha) చేపట్టనున్నారు. ఈ మేరకు దీక్షకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నారా లోకేష్ తో పాటు ఈ దీక్షలో టీడీపీ పలువురు ఎంపీలు పాల్గొనబోతున్నట్లు సమాచారం. న్యాయం కోసం పోరాడే వాళ్లంతా తమకు మద్దతు తెలిపాలని లోకేష్ కోరారు. అక్రమంగా కేసులు బనాయించి ప్రజలకు మేలు చేసిన వారికి జైల్లో పెడతారనే భయం మొదలైతే ఎవరూ రాజకీయాల్లోకి వచ్చేందుకు సాహసం చేయరన్నారు. గాంధీ జయంతి(Gandhi Jayanti) సందర్భంగా చంద్రబాబు(Chandrababu) భార్య నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari)రాజమండ్రిలోనే ఒక్కరోజు నిరాహార దీక్ష(hunger strike) చేయనున్నారు. రాజమండ్రిలోని రేణుక రెసిడెన్సీలోనే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేపడతారు. అయితే దీక్ష ప్రారంభానికి ముందు భువనేశ్వరి మీడియాతో మాట్లాడనున్నారు. తమ దీక్షకు కారణం చెబుతూ, ఇలాంటి దీక్ష ఎందుకు అవసరమో భువనేశ్వరి వివరించారు.
చంద్రబాబు(Chandrababu) అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టాలని, ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొనాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు ఒక్కరోజు దీక్షకు టీడీపీ నేతలు, ఆయన మద్దతుదారులు మద్దతు తెలిపారు. చంద్రబాబుకు సంఘీభావంగా పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షకు రెడీ అవుతున్నారు. అవినీతి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేకున్నా తమ నేతను అన్యాయంగా కేసుల్లో ఇరికించి వేధింపులకు గురిచేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు.