ఏపీ రాజకీయాల్లో(AP POLITICS) సంచలనం చోటుచేసుకుంది. సిట్ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు(ACB COURT).. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు(SKILL DEVELOPMENT CASE)లో చంద్రబాబు(CHANDRABABU)కు ఈ నెల 22 వరకు అంటే 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్(JUDICIAL) విధించింది. దీంతో ఈ రాత్రికి బాబును సిట్ ఆఫీసుకు తీసుకెళ్లి.. సోమవారం ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు(RAJAHMUNDRY CENTRAL JAIL)కు తరలించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు శనివారం నంద్యాల(NANDYALA)లో అరెస్టు చేసి.. విజయవాడ సీఐడీ(VIJYAWADA CID) కార్యాలయానికి తరలించారు. దీంతో 40 గంటలుగా ఉత్కంఠ నెలకొంది. 34 అభియోగాలను నమోదు చేసిన సీఐడీ(CID).. చంద్రబాబును ప్రశ్నించిన అనంతరం.. సీబీఐ కోర్టులో ఆదివారం తెల్లవారుజామున ప్రవేశపెట్టింది. ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబే కుట్రకు ప్రధాన సూత్రదారి అని సీఐడీ ఏసీబీ కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించింది. మొత్తం 28పేజీలతో కూడిన చంద్రబాబు రిమాండ్ రిపోర్టును సమర్పించింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగిన తీరును సీఐడీ వివరించడంతోపాటు చంద్రబాబు ఆదేశాలతోనే డబ్బు రిలీజ్ అయ్యిందని తెలిపింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడును ముద్దాయిగా చేర్చాలని సీఐడీ మెమో దాఖలు చేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ కేసులో 409 సెక్షన్ పెట్టడం సరికాదని లూథ్రా వాదించారు. సెక్షన్ 409 పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలన్నారు. రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలంటూ నోటీసు ఇచ్చారు. లూథ్రా ఇచ్చిన నోటీసు మేరకు తిరస్కరణ వాదనలకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అవకాశం కల్పించారు. ఈమేరకు వాదనలు వినిపించిన లూథ్రా…. సీఐడీ రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని కోరారు. ఇక ఈ కేసులో సీఐడీ తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. శనివారం ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్టు చేసి.. 24 గంటల్లోపే కోర్టులో ప్రవేశపెట్టామని చెప్పారు. స్కిల్ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేసినట్లు ఏఏజీ తెలిపారు. 2015లోనే స్కామ్ మొదలైందన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. జీవో నెంబర్ 4 జారీలో కుట్ర దాగి ఉందన్నారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు పాత్ర అత్యంత కీలకమని వాదించారు. చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించడానికి అనుమతించాలని సుధాకర్ రెడ్డి కోరారు. సీఐడీ తరఫున వాదనలు పూర్తయ్యాక న్యాయమూర్తి 15 నిమిషాలు విరామం ప్రకటించారు. విరామం తర్వాత సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఎంతో ఉత్కంఠ తరువాత చంద్రబాబు నాయుడుకి 14రోజులు జ్యూడిషయల్ రిమాండ్ విధించింది కోర్టు.