రాజ్యాలు రాళ్ళలో కరిగిపోవచ్చు.. రాజులు మట్టిలో కలిసిపోవచ్చు. అంగరంగ వైభవంగా అలరారిన అలనాటి కళా వైభవాన్ని నేటికీ సజీవంగా కళ్ల ముందుంచేవి మాత్రం అపూరప చారిత్రక కట్టడాలే. అందులో ఆధ్యాత్నిక సౌరభాలను వెదజల్లుతూ.. అద్భుత కళా సంపదను నింపుకున్న దేవాలయాల్లో ఎన్నో అంతుపట్టని రహస్యాలు. శాస్త్ర, సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా ఆ రహస్యాల ఛేదన కొనసాగుతూనే ఉంది కానీ, ఒక కొలిక్కిరావడం లేదు. వాటిలో ఒక్కటి విజయనగర సామ్రాజ్యంలో ఒక వెలుగు వెలిగిన హంపి నగరంలోని విరూపాక్ష దేవాలయం. ఈ కోవెలలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. అవి ఏంటో ఇక్కడ చదివేయండి.
భక్తి
-
-
శక్తి స్వరూపుణి వెలసిన అత్యంత శక్తిమంతమైన క్షేత్రం కామాఖ్యాదేవి మందిరం. సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠల్లో అత్యంత శక్తిమంతమైనది కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. ఇక్కడ వెలసిన దేవిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. అస్సాంలోని బ్రహ్మపుత్రా నది ఒడ్డున, గౌహతికి సమీపంలో నీలాచల్ పర్వతశ్రేణి మీద ఈ కామాఖ్యా దేవి క్షేత్రం విరాజిలుతోంది. ఎలాంటి విగ్రహారాధనా జరగని కామాఖ్యా అమ్మవారి ఆలయ విశేషాలు..
-
11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు, విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన వేయి స్తంభాల ఆలయ విశేషాలు మీకోసం..
-
సుమారు 500ఏళ్ల పైగా చెక్కు చెదరని వర్ణ చిత్రాలూ, భారీ నంది విగ్రహం, ఏడు పడగల నీడన శివుడు, వేలాడే ఆకాశ స్థంభం.. ఇలాంటివెన్నో ఆకర్షణలు ఈ ఆలయం సొంతం. అబ్బురపరిచే శిల్ప సంపదకే కాదు, ఔరా అనిపించే చిత్రకళా నైపుణ్యానికీ నిలయం ఈ లేపాక్షి ఆలయం. ఎంతో చరిత్ర కలిగిన ఈ వీరభద్ర ఆలయ విశేషాలు మీకోసం.
-
పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరీ క్షేత్రానికి శ్రీ క్షేత్రం, శంఖ క్షేత్రం, నీలాచలం, నీలాద్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. పూరీ అంటే పూరించేదని అర్థం. భక్తుల కోర్కెలు తీర్చే దివ్యక్షేత్రం కావడంతో పూరీ అనే పేరు జగన్నాథుడి కరుణా కటాక్షానికి పర్యాయ పదమైందని భక్తుల విశ్వాసం. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు ఇక్కడ కొలువయ్యాడు.
-
పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో దేశానికి దక్షిణ భాగంలో వున్న మహాక్షేత్రం రామేశ్వరం. సనాతన హిందూ మతానికి సంబంధించిన చార్ ధామ్‌లలో ఒకటైన రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉంది. లయకారకుడైన శివుడు రామనాథస్వామిగా భక్తులను ఆశీర్వదిస్తుంటారు. తమిళనాడుకు ప్రధాన భూభాగమైన మండపానికి సమీపంలోని రామేశ్వరం ద్వీపంలో వున్న ఈ క్షేత్రం విశేషాలు..
-
భారత్ దేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న వెయ్యి సంవత్సరాల నాటి కోవెల తంజావూరులోని బృహదీశ్వరాలయం. ఈ ఆలయంలో కనిపించే ప్రతి అంశం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎక్కడ సిమెంట్, ఉక్కు అనే మాటకు తావు లేకుండా నిర్మించిన ఈ గుడిని చూస్తే.. ఆనాటి టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది. ఆశ్చర్యంతో పాటు ఆసక్తి రేపుతున్న తంజావూరిలోని బృహదీశ్వరాలయం విశేషాలు.
-
భారతదేశం అనేక సంస్కృతి సంప్రదాయాలకు ఆయువు పట్టు. రాజుల కాలం నుంచి నేటి వరకు దేశంలో ఎన్నో రకాల సంస్కృతులు.. వీటికి గుర్తులుగా పురాతన ఆలయాలు, చారిత్రక కట్టడాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి పన్నెండేళ్ల పాటు 1200 మంది శిల్పులు కష్టపడి నిర్మించిన ఆలయం కోణార్క్ దేవాలయం. ఈ కోవెల విశేషాలు మీకోసం..
-
భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో ఎంతో అద్భుతంగా నిర్మించబడిన ఓ చారిత్రాత్మక కట్టడం అక్షరధామ్. వేదాలలో, ఉపనిషత్తులలో నిర్వచించబడిన శాశ్వత విలువలు, సుగుణాలకు నెలవు ఈ స్వామి నారాయణ అక్షరధామ్. దాదాపు వంద ఎకరాల సువిశాల భూభాగంలో నిర్మితమై..
-
అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవీ కోవెల తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారి నాభిస్థానం పడిందని పురాణ గాథ. ఈ క్షేత్రాన్ని సప్తపురి అని పిలుస్తారు. ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్న ఈ కోవెల విశేషాలు..