రాజమండ్రి పోలీస్ స్టేషన్‌లో సినీ నటుడు పోసాని కృష్ణమురళీ(Posani Krishna Murali)పై కేసు నమోదు అయింది. పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన పార్టీ నేతలు గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. జనసేన నేతలు. పోసానిపై కేసు నమోదు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోసాని కృష్ణమురళి పై … IPC 354, 355, 500,504, 506, 5007, 5009 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు..
పవన్ కల్యాణ్(Pawan Kalyan) ను ఆయన కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్లుగా దూషించే పోసానిపై.. గతంలో జనసేన పార్టీ(Janasena party) రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజమండ్రి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు యందం ఇందిరా.. అయితే, ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. కోర్టును ఆశ్రయించారు. దూషణల విషయంలో పోసానిపై కేసు నమోదవడం ఇదేమదటి సారి కాదు. 2022లో జనసేన పార్టీ రాజమహేంద్రవరం నేత యందం ఇందిరా ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానిక రెండో జె.ఎఫ్.సి.ఎం కోర్టు ఆదేశాలతో పోసాని కృష్ణ మురళిపై ఐపీసీ 354, 355, 500, 504, 506, 507, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు ఇంకా విచారణలో ఉంది. మరో సారి దూషణలకు పాల్పడటంతో మళ్లీ ఆవే సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ నేత, ప్రముఖ సినీ రచయిత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ ధియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గా నియమించారు. పోసాని కృష్ణమురళి సీఎం జగన్‌కు వీరాభిమాని. ముఖ్యంగా పవన్ కల్యాణ్, మెగా ఫ్యామిలీలో అందర్నీ ఆయన అసభ్యంగా దూషించిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. చాలా కాలంగా వైఎస్ఆర్‌సీపీకి నమ్మకంగా పని చేస్తున్నప్పటికీ.. పదవి లభించలేదు. ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల అంశంపై సంప్రదింపులు జరిపినప్పుడు ఆలీతో పాటు పోసానిని కూడా ఆహ్వానించింది. ఆ తర్వాత పోసాని కృష్ణమురళి మరోసారి సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా కలిశారు. ఆ తర్వాత పదవి ప్రకటించారు. నారా లోకేష్ కూడా కోర్టులో పోసానిపై ప్రైవేటు కేసు వేశారు. అయితే తనను కోర్టుల చుట్టూ తిప్పుతూ హత్య చేయాలనుకుంటున్నారని పోసాని ఆరోపించారు. అయితే కేసులు నమోదైనా.. పోసాని తనదైన లాంగ్వేజ్ తో పవన్ ను.. ఆయన కుటుంబాన్ని. విమర్శిస్తూనే ఉన్నారు.