కెనడా(CANNADA) ప్రధాని(PRIME MINISTER) జస్టిన్ ట్రూడో(JUSTIN TRUDEAU) ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీ(DELHI) నుంచి బయల్దేరేందుకు ప్రయత్నిస్తుండగా సాంకేతిక సమస్య(TECHNICAL ISSUE) తలెత్తింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ20(G20) సమావేశానికి విచ్చేసిన జస్టిన్ ట్రూడో తిరిగి కెనడాకు బయల్దేరుతుండగా.. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు సమాచారం. విమానంలో సమస్య తలెత్తడంతో ఆయన తిరిగి ఢిల్లీలోనే ఉన్నారు.
జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు దేశ రాజధానికి వచ్చిన కెనడా ప్రతినిధి బృందం, గ్రౌండ్‌లోని ఇంజనీరింగ్ బృందం సమస్యను సరిదిద్దే వరకు భారతదేశంలోనే ఉంటుందని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. జస్టిన్ ట్రూడో తన కుమారుడు జేవియర్‌తో కలిసి సెప్టెంబర్ 8న జీ20 సమ్మిట్ సందర్భంగా ఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం ఆయన కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదం గురించి ప్రధానమంత్రి(PRIME MINISTER) నరేంద్ర మోడీ(NARENDRA MODI)తో సమావేశమయ్యారు.
ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా జస్టిన్ ట్రూడోతో భేటీపై స్పందించారు. వివిధ రంగాలలో పూర్తి స్థాయి ఇండియా-కెనడా సంబంధాల గురించి చర్చించామని ట్విట్టర్(TWITTER)లో పేర్కొన్నారు. జులైలో, భారత ప్రభుత్వం ఢిల్లీలోని కెనడా రాయబారిని పిలిపించి, కెనడాలో ఖలిస్తానీ అనుకూల గ్రూపుల ఉనికి గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారిక దౌత్య సందేశాన్ని అందజేసింది. ఆ సమయంలో ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. కెనడా టెర్రరిజంపై స్థిరంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని, అలా చేయడంలో తన నిబద్ధతను కొనసాగిస్తుందని చెప్పారు. ఖలిస్తాన్ మద్దతుదారులు, దేశంలోని ఉగ్రవాదుల పట్ల తమ ప్రభుత్వం మెతకగా వ్యవహరిస్తుందని భావించడం సరికాదని ఆయన ఉద్ఘాటించారు.