బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం(BRS Party Parliamentary Conference) ఈనెల 15వ తేదీన జరగనుండగా ఆ పార్టీ అధినేత సీఎం కేసిఆర్(CM KCR) అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి లోక్ సభ, రాజ్యసభ సభ్యులు(Members of Lok Sabha and Rajya Sabha) తప్పనిసరిగా హాజరు కావాలని సీఎం కేసీఆర్ కోరారు. ఈనెల 18 నుంచి జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.ఇతర అంశాలపై కాంగ్రెస్, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు పట్టుబట్టే అవకాశం ఉన్నది. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ పై చర్చ జరపాలని ఎమ్మెల్సీ కవిత వివిధ పార్టీలకు లేఖ రాయగా వీటన్నింటిపై బీఆర్ఎస్(BRS) వైఖరిని కేసీఆర్(CM KCR) నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. దేశం పేరు మార్పు వంటి కీలక అంశాలు సైతం పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో చర్చకు రావచ్చునని ప్రచారం జరుగుతుంది.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈనెల 18 నుండి 22 వరకు ఐదు రోజులపాటు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహల్లద్ జోసి(Minister Prahallad Josi) ప్రకటించారు. ఈ ప్రత్యేక సమావేశాల్లో ఫలప్రదమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్లో తెలిపారు. ఐదు రోజులపాటు జరగనున్న ప్రత్యేక సమావేశాల అజెండాపై స్పష్టత లేనప్పటికీ పార్లమెంటు కొత్త భవనంలోకి మారెందుకు ఈ భేటీ అని కొందరు అంటుండగా, జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యసాధ్యాలపై చర్చించించేందుకే అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
జమిలి ఎన్నికలు(Jamili elections) నిర్వహించేందుకే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. వీటితోపాటు ఇటీవల ముగిసిన జీ-20 సదస్సులో కీలక చర్చలు, జమ్మూ కాశ్మీర్లో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం చెప్పిన నేపథ్యంలో ఈ ప్రత్యేక సమావేశాలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి తోడు జమిలి ఎన్నికల సాధ్యసాధ్యలపై అధ్యయనం కోసం ఇటీవల కేంద్రం ఓ ప్రత్యేక కమిటీని నియమించింది.
అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించిన బిఆర్ఎస్(BRS Party) పార్టీ జమిలి ఎన్నికల చర్చ పైకి రావడంతో ఆ దిశగా సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్న సిద్ధంగా ఉండాలని భావిస్తోంది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ నేతలకు దిశా నిర్దేశం చేయగా, ఇటీవల పార్టీ ముఖ్య నాయకులతో వరుసగా నిర్వహించిన సమావేశాల్లో ఇదే అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో పార్లమెంటు ఎలక్షన్స్ ముందుగా వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఆలస్యంగా జరిగినందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు కేసీఆర్ నిర్దేశించినట్లు సమాచారం.