ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం (BRS Parliamentary Meeting)సాగుతోంది. ఈ సమావేశంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు కే కేశవరావు(Rajya Sabha Member K Kesha Rao), సంతోష్ కుమార్(Santosh Kumar)లతో సహా లోక్ సభ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఏయే బిల్లులు సభలో వస్తాయి? ఆ అంశాలపై ఏ విధంగా స్పందిచాలన్న అంశాలపై విస్తృతంగా చర్చిస్తున్నారు. ‘వన్ ఇండియా వన్ నేషనల(one India one Nation)’ లో భాగంగా జమిలి ఎన్నికలు(Jamili elections), ఇండియా పేరు భారత్ మార్చాలన్న కేంద్రం ప్రతిపాదనలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై బీఆర్ఎస్(BRS) వైఖరిపై అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
మరోవైపు.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు(Palamuru-Ranga Reddy Lift Project)పై గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లతో సీఎం భేటీ అయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై కేసీఆర్(CM KCR) విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ఈనెల 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్‌ను కేసీఆర్ ప్రారంభించనున్నారు. నార్లాపూర్ ఇన్‌టేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి ప్రారంభోత్సవం చేయనున్నారు.
ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు పాలమూరు-రంగారెడ్డి (Palamuru-Ranga Reddy Lift Project) సిద్ధమైంది. ఇందులో భాగంగానే 2 కిలోమీటర్ల దూరంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీటి ఎత్తిపోయనుంది. ఈ నేపథ్యంలోనే కృష్ణానదికి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రపంచంలోనే మరెక్కడా లేని అత్యంత భారీ పంపులతో నిర్మితమైన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు.. దక్షిణ తెలంగాణ ప్రజల తాగు, సాగునీరు అవసరాలను తీర్చనున్నాయని కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఈ ఎత్తిపోతల పథకానికి స్వరాష్ట్రంలో.. ప్రభుత్వ దార్శనికతతో అనేక అడ్డంకులను దాటుకుని మోక్షం లభించడం చారిత్రక సందర్భమని కేసీఆర్ అన్నారు.