ఎన్నికలు(ELECTIONS) సమీపిస్తున్న వేళ.. సీఎం కేసీఆర్ రోజుకో శుభవార్త చెబుతూనే ఉన్నారు. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేందుకు సీఎం కేసీఆర్ (CM KCR) తీసుకుంటున్న చర్యల్లో భాగంగా… ఇప్పటికే పింఛన్లు పెంచడం, జీతాలు పెంచడం… ఇలా ఎన్నో శుభవార్తలు చెబుతున్నారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం(TEACHERS DAY) సందర్భంగా.. కేసీఆర్ సర్కార్(KCR GOVERNMENT) మరో తీపి కబురు చెప్పింది. గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న 567 మంది కాంట్రాక్ట్ టీచర్ల(CONTRACT TEACHERS)ను ప్రభుత్వం(GOVERNMENT) రెగ్యులర్(REGULAR) చేసింది.
ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసిన ఈ 567 మంది ఉపాధ్యాయులు గత 16 ఏళ్లుగా గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్నారు. అయితే ఈ రెగ్యులరైజ్డ్ ఉద్యోగులందరికీ ప్రభుత్వం 12 నెలల జీతం, మూలవేతనం, 6 నెలల ప్రసూతి సెలవులను కూడా ప్రకటించింది. కాగా, ఇప్పటికే బీసీ గురుకులాల్లో 139 మంది కాంట్రాక్ట్ టీచర్ల(CONTRACT TEACHERS)ను కేసీఆర్ ప్రభుత్వం(KCR GOVERNMENT) రెగ్యులరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎస్సీ గురుకులాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 567 మంది ఉపాధ్యాయుల్లో 504 మంది మహిళలు ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంట్రాక్ట్ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను(KOPPULA ESHWAR) కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రెగ్యులర్ టీచర్లతో పాటు పీఆర్సీ అమలుతో పాటు కాంట్రాక్టు అధ్యాపకులకు పూర్తి వేతనాలు చెల్లిస్తున్నారని ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
ఇక మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు తేదీలు ఖరారు చేసిన విషయం తెలిసిందే.. దీనిపై విద్యాశాఖ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఇటీవల హైకోర్టు టీచర్ల బదిలీలకు అనుమతి ఇవ్వడంతో తాజాగా బదిలీ ల ప్రక్రియను ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది.. రాష్ట్రవ్యాప్తం గా 1.05 లక్షల మంది టీచర్లు ఉన్నట్లు సమాచారం..రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడటంతో టీచర్స్ బదిలీ ల ప్రక్రియ ను ప్రభుత్వం స్పీడ్ అప్ చేస్తుంది.ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ఈ విధంగా వుంది.ఈనెల 5వ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించింది..ఈనెల 6 మరియు 7 వ తేదీల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన కాపీలను డీఈవో కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది..అలాగే 8 మరియు 9 తేదీల్లో దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు అధికారులు వెల్లడిస్తారు. 10, 11 తేదీల్లో అభ్యంతరాలను స్వీకరిస్తారు..
12, 13వ తేదీ న సీనియారిటీ జాబితాలను ప్రచురిస్తారు.14 వ తేదీన ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. 15 వ తేదీన ఆన్‌లైన్ ద్వారా ప్రధానోపాధ్యాయుల బదిలీలు నిర్వహించడం జరుగుతుంది.. 16వ తేదీన ప్రధానోపాధ్యాయుల ఖాళీలను ప్రదర్శిస్తారు. 17, 18, 19 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్‌ఎంలుగా పదోన్నతులును కల్పిస్తారు. 20,21 తేదీల్లో ఖాళీ అయిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రకటించడం జరుగుతుంది.21వ తేదీ న వెబ్ ఆప్షన్ల ఎంపిక జరుగుతుంది. 22వ తేదీ న ఎడిట్ ఆప్షన్ అవకాశం కల్పిస్తారు. 23,24 వ తేదీ న స్కూల్ అసిస్టెంట్ బదిలీలు జరుగుతాయి. అలాగే 24 వ తేదీ న స్కూల్ అస్టింట్ ఖాళీలను వెల్లడిస్తారు. 26, 27, 28 తేదీల్లో ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతులు కల్పిస్తారు.29, 30, 31వ తేదీల్లో ఎస్‌జీటీ ఖాళీల వివరాలు తెలియజేస్తారు .అక్టోబర్ 2వ తేదీ న ఎడిట్ ఆప్షన్స్ అవకాశం ఉంటుంది. అక్టోబర్ 3వ తేదీ న ఎస్‌జీటీ, భాషాపండితులు, పీఈటీల బదిలీలు నిర్వహిస్తారు.అక్టోబర్ 5వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అప్పీల్ చేసుకునే అవకాశం వుంది.