అమ్మాయిలని అర్థం చేసుకోవడంలో అబ్బాయిలు ఎప్పుడు వెనుకబడే ఉంటున్నారు. నిపునుల సూచన మేరకు అమ్మాయిలలో అబ్బాయిలు ఈ విషయాన్ని గ్రహిస్తే వారి మధ్య ఎలాంటి బేధా అభిప్రాయాలు రావని అధ్యాయనాలు తెలుపుతున్నాయి. అమ్మాయిలు ఏదైనా చెప్పినప్పుడు.. చాలా మంది మగవారు చేసే తప్పు ఏంటంటే.. ఆడవారిని అంతగా అర్థం చేసుకోరు. వారు ఏం చెప్పినా వినరు. అంతేకాదు, మధ్యలోనే ఆపేస్తారు. ఏదో చెబుతుంటారు. కానీ, దానిని ఆడవారు పట్టించుకోరని అర్థం చేసుకోండి. ఆడవారికి ఫ్రెండ్స్ ఉంటారు. వారిని మీరు కోప్పడడం కూడా ఆడవారికి అస్సలు ఇష్టం ఉండదు. దీంతో వారు తెగ ఫీల్ అవుతారు. తప్పుగా అనుకుంటారు. అందుకే వారి గురించి చెడుగా చెప్పడం, కంప్లైంట్ చేయడం చేయొద్దు. మగవారికంటే ఆడవారికి దుస్తులు అంటే చాలా ఇష్టం. కేవలం వాటిని ఇష్టపడడం మాత్రమే కాదు. ఒక్కో డ్రెస్సుతో వారికి ఓ కథ ఉంటుంది. వారికి సంబంధించి అదో సెంటిమెంట్.
పీరియడ్స్ టైమ్‌లో ఆడవారు అనుభవించే అసౌకర్యాలను ముఖ్యంగా ఆ టైమ్‌లో వారి భావోద్వేగాలను మగవారు అస్సలు అర్థం చేసుకోలేరు. మహిళలు ఒంటరిగా బయటికి వెళ్తే ఇంట్లో పురుషులు, ఫ్రెండ్స్ వారి భద్రత గురించి భయపడతారు. ఇది నిజమే కానీ, ఆడవారు.. తమకి ఇష్టమైన ప్లేసెస్‌కి ఒంటరిగా వెళ్ళేందుకు ఇష్టపడతారు. దీని గురించి మగవారు పెద్దగా పట్టించుకోరు.
ప్రతి రిలేషన్ షిప్ లో కొన్ని సీక్రెట్లు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కొన్ని రహస్యాలను ఇతరులతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా అమ్మాయిలు తాము ప్రేమించిన వ్యక్తులతో కూడా పంచుకోలేని కొన్ని సీక్రెట్లు ఉంటాయి. ఆశ్చర్యంగా అనిపించినా ప్రేమించిన అబ్బాయిలకు కొన్ని విషయాలను అమ్మాయిలు చెప్పడానికి ఇష్టపడరు. అబ్బాయిలు సైతం అమ్మాయిలతో ఈ విషయాల గురించి ఎక్కువగా చర్చించడం కరెక్ట్ కాదు.
అబ్బాయిలు అమ్మాయిల గ్రూప్ చాట్ గురించి అస్సలు అడగకూడదు. అమ్మాయిలు తన స్నేహితులతో ఎన్నో విషయాలను పంచుకుంటారు. ఆ చాట్ గురించి కానీ తన స్నేహితుల సీక్రెట్ల గురించి కానీ అమ్మాయిలు స్నేహితులతో చాట్ చేసిన విషయాల గురించి చర్చను కానీ అస్సలు ఇష్టపడరు. అమ్మాయిలను ప్రేమించిన అబ్బాయిలు క్రష్ గురించి అడిగితే నిజాలు చెప్పరు. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు దగ్గర గొప్పలకు పోయి తమ పాత సంబంధాలు ఇతర అంశాల గురించి మాట్లాడుతుంటారు. ఇది అంత మంచిది కాదని చెబుతున్నారు పరిశోధకులు. దీని వల్ల అమ్మాయిల మీరు ఇష్టపడే అమ్మాయిలు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. జెన్యున్‌గా ఉండాలి. కానీ, అది కొన్ని విషయాలకే పరిమితం చేయాలని చెబుతున్నారు.