విజయవాడ(VIJYAWADA) సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్(GANNAVARAM AIRPORT)కి బాంబు బెదిరింపు(BOMB THREAT) ఫోన్ కాల్(PHONE CALL) రావడంతో తీవ్ర కలకలం రేగింది.. అప్రమత్తమైన ఎయిర్ పార్ట్ సిబ్బంది.. తనిఖీలు చేపట్టారు.. విమానాల రాకపోకలు సైతం నిలిపివేసినట్టు తెలుస్తోంది.. అయితే, అది ఆకతాయిల పనిగా తెలుస్తోంది.. ఎందుకంటే ఆకతాయి మళ్లీ ఫోన్ చేసి అలాంటిది ఏమీ లేదని చెప్పినట్టు సమాచారం. ఇక, ఢిల్లీ(DELHI) వెళ్లాల్సిన విమానం గంట(ONE HOUR) ఆలస్యంగా బయల్దేరింది.. ఆకతాయి తణుకు(TANUKU) ప్రాంతం నుంచి ఫోన్(PHONE CALL) చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలసులు(POLICE).
గన్నవరం ఎయిర్ పోర్ట్ కి బాంబు బెదిరింపు ఫేక్ కాల్(FAKE CALL) పై కేసు నమోదు చేశారు.. ఎయిరిండియా(AIR INDIA) సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు గన్నవరం పోలీసులు.. నిన్న రాత్రి ఎయిర్ పోర్టులో బాంబు ఉందనే ఆకతాయి ఫోన్ తో అలజడి నెలకొందని తెలిపారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఢిల్లీకి విమానాన్ని పంపించారు ఎయిర్ పోర్ట్ అధికారులు.. తణుకు ప్రాంతం నుంచి ఆకతాయి కాల్ వచ్చినట్టు ప్రాథమిక నిర్దారణ వచ్చిన గన్నవరం పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తంగా బాంబు బెదిరింపు ఫోన్ కాలం.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర కలకలం రేపింది.
అయితే, గన్నవరం ఎయిర్ పోర్ట్ కి బాంబు బెదిరింపు ఫేక్ కాల్ చేసిన ముప్పాళ్ల రంగ రామన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు తణుకు పోలీసులు.. ఎయిర్ పోర్టులో బాంబు ఉందని నిన్న రాత్రి ఫేక్ కాల్ చేశాడు రంగ రామన్.. గతంలో కూడా పలువురు వీఐపీలకు కాల్ చేసి రంగరామన్ బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది.. అతని మానసిక స్థితి చూసి మందలించి వదిలేసినట్టుగా తెలుస్తుండగా.. ఎయిర్ పోర్ట్ కి బాంబు బెదిరింపు కాల్ చేయడంతో రంగరామన్ను గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
రాష్ట్రంలో వరుస బాంబు బెదిరింపు కాల్స్ అధికారులను, ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిన్న గన్నవరం విమానాశ్రయం, నేడు నెల్లూరు రైల్వే స్టేషన్(NELLORE RAILWAY STATION)లో బాంబులు ఉన్నాయంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ రావటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తీరా చూస్తే అక్కడ బాంబులు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల్లూరు రైల్వే స్టేషన్లో బాంబు కలకలం రేగింది. ఒకటో ప్లాట్ ఫాంపై బాంబు పెట్టారని, కొద్ది సమయంలో పేలుతుందంటూ.. 112 నంబరుకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన రైల్వే అధికారులు.. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో రైల్వే స్టేషన్‌లో సోదాలు చేశారు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు పరుగులు తీశారు. పార్శిల్ కేంద్రంతో పాటు ప్రయాణికుల బ్యాగులు కూడా తనిఖీ చేశారు. ఎక్కడా బాంబు కనిపించక పోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేశాక స్విఛాప్ చేసిన ఆకతాయి కోసం పోలీసులు వెదుకుతున్నారు.