బాలీవుడ్ హీరోయిన్‌లలో కరీనా కపూర్‌కి ఒక సెపరేట్ స్టార్‌డమ్ ఉంది. భజరంగీ భాయిజాన్, త్రీ ఇడియట్స్, జబ్ వి మెట్, కభీ ఖుషి కభీ ఘం, బాడీగార్డ్ చిత్రాలతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది కరీనా. ఒకప్పుడు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ బెబో.. సైఫ్ అలీఖాన్‌తో వివాహం అనంతరం సినిమాలు తగ్గించింది. ఇక కరీనా నటించిన చివరి చిత్రం లాల్ సింగ్ చద్దా. అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. చాలా కాలం తర్వాత కరీనా కపూర్ చేస్తున్న చిత్రం జానే జాన్. కరీనా కపూర్‌కు ఫస్ట్ ఓటీటీ డెబ్యూగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్ తాజాగా షార్ట్ టీజర్‌ను వదిలారు.
థ్రిల్లర్ జానర్‌లో రానున్నట్లు ఈ షార్ట్ టీజర్ చూస్తే తెలుస్తుంది. ఒక గదిలో కరీనా కపూర్ జానే జాన్ అనే పాట పాడుతుండగా.. పాతల్ లోక్ ఫేమ్ జైదీప్ అహ్లావత్, విజయ్ వర్మ పాత్రలు కనిపిస్తాయి. కాగా.. ప్రస్తుతం ఈ టీజర్ వైరల్ అవుతుంది. ప్రముఖ జపనీస్ రచయిత కెఇగో హైగాశినో రాసిన ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ నవల ఆధారంగా వస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నాడు. కరీనా కపూర్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 21న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.