బిహార్(BIHAR) ముజఫర్‌పుర్(MUJFARPUR) జిల్లాలో(DISTRICT) విద్యార్థులు(STUDENTS) ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడడం వల్ల 10 మంది చిన్నారులు(10 CHILDREN) గల్లంతయ్యారు. గురువారం ఉదయం మధురపట్టి ఘాట్(MADHURAPATTI GHAT) సమీపంలోని భాగమతి నది(BAGHAMATHI RIVER)లో బోల్తా పడింది. పక్క గ్రామంలో ఉన్న పాఠశాలకు విద్యార్థులు పడవలో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో పడవలో 30 మంది విద్యార్థులు(30 MEMBERS STUDENTS) ఉన్నారు. ఈ దుర్ఘటన గురించి తెలియగానే స్థానికులు నాటు పడవలతో సహాయక చర్యలు చేపట్టి 20 మంది చిన్నారులను(20MEMBERS STUDENTS) ఒడ్డుకు చేర్చారు. విద్యార్థుల్లో కొందరికి ఈత రావడం వల్ల ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు(POLICE), రెస్క్యూ సిబ్బంది(RESCUE DEPARTMENT).. వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను పిలిపించి గల్లంతైన చిన్నారుల కోసం గాలిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన చిన్నారులు గల్లంతు కావడం వల్ల అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.
పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. డబ్బుకు ఆశపడి ఎక్కువ మంది విద్యార్థులను ఒకే పడవలో ఎక్కించున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల అసలు కారణాల కోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు అధిక వర్షాలు, నేపాల్లో నుంచి నది ప్రవాహం ఎక్కువ కావడం వల్ల ప్రమాదం జరిగిందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ముజఫర్‌పుర్ పర్యటనలోనే ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్.. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.