తెలంగాణ(TELANGANA) సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను(ASSEMBLY ELECTIONS) ఎదుర్కొనబోయే అయిదు రాష్ట్రాల్లో(5 STATES) అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది భారతీయ జనతా పార్టీ(BHARTHIYA JANATHA PARTY). దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది. వాటిని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్(EXECUTE) చేయడానికి కసరత్తు పూర్తి చేస్తోంది.
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాజస్థాన్(RAJASTHAN), ఛత్తీస్‌గఢ్(CHATTISGARH), తెలంగాణ(TELANGANA), మిజోరం(MIZORAM)లల్లో అధికారంలోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మధ్యప్రదేశ్(MADHYAPRADESH)లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకోవడంలో తలమునకలయ్యారు కమలనాథులు.
ఈ పరిణామాల మధ్య- మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగబోయే 39 మంది అభ్యర్థులతో కూడిన మలి జాబితాను విడుదల చేసింది బీజేపీ. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ.. ఆ తరువాత చేపట్టిన ఆపరేషన్ లోటస్ సహకారంతో కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్(CONGRESS) ప్రభుత్వాన్ని కూల్చివేయగలిగింది. కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. ఇప్పుడు సంపూర్ణ మెజారిటీని సాధించి.. ప్రభుత్వాన్ని నెలకొల్పాలనే పట్టుదలతో ఉంది బీజేపీ(BJP). దీనికోసం కట్టుదిట్టమైన వ్యూహాలను రచించుకుంటోంది. కాంగ్రెస్‌ను ఓడించడానికి కసరత్తు పూర్తి చేస్తోంది.
ఇందులో భాగంగా ముగ్గురు కేంద్ర మంత్రులను మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్థే పేర్లను మలి జాబితాలో చేర్చింది. మొరెనా లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న నరేంద్ర సింగ్ తోమర్.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దిమానీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ప్రహ్లాద్ సింగ్ పటేల్ సొంత లోక్‌సభ స్థానం దమో కాగా.. ఆయనకు నర్సింగ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించింది బీజేపీ. ఫగ్గన్ సింగ్ కులస్తే.. 2019 ఎన్నికల్లో మంద్లా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడాయన నివాస్ సీటు నుంచి అసెంబ్లీ బరిలో దిగనున్నారు.