BJP Manifesto: తెలంగాణలో ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరుకుంది. ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ.. ప్రధాన పార్టీలు జనరంజక మేనిఫెస్టోలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. నిన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేయగా.. ఇవాళ బీజేపీ మేనిఫెస్టో విడుదల కానుంది
బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు. మోదీ గ్యారంటీ పేరుతో బీజేపీ మేనిఫెస్టో ఉండనున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ధీటుగా బీజేపీ మేనిఫెస్టో ఉండేలా బీజేపీ అగ్ర నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మేనిఫెస్టో విడుదల చేయడంతో బీజేపీ కార్యకర్తలు,నేతలు మేనిఫెస్టో కోసం ఎదురుచూస్తున్నారు.
ధరణి స్థానంలో మీ భూమి యాప్, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్, సబ్సిడీపై విత్తనాలు… వరి పంటకు బోనస్, ఆడబిడ్డ భరోసా పథకం కింద 21 ఏళ్లు వచ్చేసరికి 2లక్షల రూపాయలు, ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్లు వంటి హామీలను ప్రధానంగా బీజేపీ మేనిఫెస్టోలో ఉండనున్నట్లు తెలుస్తోంది.