తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఫైటర్.. చీటర్‌తో కలవరని ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్(Minister KTR) తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఎన్డీఏ(NDA)లో కలవాలని ఎవరూ అనుకునే పరిస్థితినే లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఎన్నో పార్టీలు ఎన్టీఏ కూటమి నుంచి బయటకు వచ్చేశాయన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్(KTR) మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, ఎన్డీఏ కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ అంటే బిగ్గెస్ట్ జుమ్లా పార్టీ ఇన్ ఇండియానని విమర్మించారు. ఎన్టీడీఏ(NDA)లో కలవాలని ఎవరూ అనుకునే పరిస్థితినే లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఎన్నో పార్టీలు ఎన్టీఏ కూటమి నుంచి బయటకు వచ్చేశాయన్నారు.
ప్రధానమంత్రి మోదీ యాక్టింగ్(Modi acting)కు ఆస్కార్ తప్పక వస్తుందని.. ఇదే స్కిప్టు రాస్తే సినిమాకి ఇస్తే బాగా విజయవంతం అవుతుందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్డీఏ కూటమిలో ఎవరూ కలవాలని అనుకునే పరిస్థితి లేదని.. ఆ కూటమిలో చేరేందుకు తామేమైనా పిచ్చికుక్కలమా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఇప్పటికే ఎన్నో పార్టీలు ఎన్డీఏను వీడి బయటికి వచ్చేశాయని గుర్తు చేశారు. బీజేపీతో దోస్తీ ఎలా ఉంటుందో టీడీపీ, ఎస్ఏడీ చూశాయని అన్నారు. ప్రస్తుతం ఎన్డీఏలో సీబీఐ, ఈడీ, ఐటీ మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎన్డీఏను వీడిన పార్టీలపైకి ఈడీ, సీబీఐలను పంపుతున్నారని మండిపడ్డారు.
“బీజేపీలో చేరిన నేతలను దర్యాప్తు సంస్థలు వదిలేస్తాయి. ఎన్టీఏ(NDA) మునిగిపోయే నావ.. అది ఎక్కాలని ఎవరూ అనుకోరు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణకు ఏం ఇచ్చారని ఓట్లు అడుగుతున్నారు. బీజేపీలో చేరిన వారిపై ఉన్న కేసులు మరుగున పడిపోతున్నాయి. నేను సీఎం కావడానికి మోదీ అనుమతి అక్కర్లేదు. 70 ఏళ్ల వయసులో మోదీ పచ్చి అబద్ధాలు చెప్పారు. అబద్ధాలతో ప్రధాని పదవి గౌరవాన్ని మోదీ తగ్గించారని” మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.
మీడియాను ఎదుర్కొనే ధైర్యం కూడా ప్రధాని మోదీ(Prime Minister Modi)కి లేదని మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ప్రధాని చేసిన పసుపు బోర్డు ప్రకటన.. అదో పెద్ద జోక్ అని విమర్శించారు. హామీ ఇచ్చిన 9 ఏళ్లకు ప్రకటన చేసి వెళ్లారన్నారు. తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లు అవుతుందని.. ఏం ఇచ్చారని ఓట్లు అడుగుతున్నారన్నారు. డీలిమిటేషన్‌పై విస్తృత చర్చ జరగాల్సి ఉందని.. యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారని ఆందోళన చెందారు. జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయని హర్షించారు. డీ లిమిటేషన్‌పై భవిష్యత్‌లో తమ పార్టీతో కలిసివచ్చే రాష్ట్రాలతో చర్చిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.