Monday, December 23, 2024
Home తెలంగాణ BJP- Congress Public Meetings on Sep17: తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచనున్న సెప్టెంబర్ 17..

BJP- Congress Public Meetings on Sep17: తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచనున్న సెప్టెంబర్ 17..

by స్వేచ్ఛ
0 comment 56 views
SEPTEMBER 17 IS HEAT DAY ON TELANGANA ELECTIONS

తెలంగాణ(TELANGANA) రాజకీయాలు(POLITICS) జాతీయ(NATIONAL) స్థాయిలో చర్చకు దారి తీసింది. ఈ సారి సెప్టెంబర్ 17వ(SEPTEMBER 17) తారీఖున అటు కాంగ్రెస్(CONGRESS).. ఇటు బీజేపీ(BJP) పార్టీలు(PARTIES) పోటాపోటీగా బహిరంగ సభలు(PUBLIC MEETINGS) నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో.. కమలం పార్టీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్(SECUNDRABAD PARADE GROUNDS) లో పెద్దు ఎత్తున సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. తుక్కుగూడ సభకు సోనియాగాంధీ(SONIA GANDHI) వస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తెలపగా.. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో విమోచన దినోత్సవ వేడుకలకు గత ఏడాదిలాగే అమిత్‌ షా(AMITH SHA) హాజరు అవుతారని సమాచారం.

అయితే, ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించాలని సిద్ధమయింది. దాదాపు పది లక్షల(10LAKHS) మంది ఈ సభకు హాజరు అవుతారని కాంగ్రెస్‌ పార్టీ ముందస్తుగానే వెల్లడించింది. తుక్కుగూడను అందుకు వేదికగా హస్తం నేతలు ఎంచుకున్నారు. ఆ తేదీ లేదా అంతకు ముందు రోజు హైదరాబాద్(HYDERABAD) నగరంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశాలు జరుగబోతున్నాయి. సోనియా గాంధీ సైతం తుక్కుగూడ సభకు హాజరు కానున్న నేపథ్యంలో.. ఈ సభను తెలంగాణ పీసీసీ(TELANGANA PCC) ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.

ఇక కాంగ్రెస్‌ తుక్కుగూడ సభకు పోటీగా కమలం పార్టీ సైతం హైదరాబాద్ లో సభ ఏర్పాటుకు ప్లాన్‌ చేసింది. పరేడ్‌ గ్రౌండ్‌లోనే తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలను కిందటి ఏడాది తరహాలోనే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది.. ఈ క్రమంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు కమలం పార్టీ నేతలు తెలిపారు. వీలైనంత ఎక్కువ జనసమీకరణ కోసం ప్రయత్నిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. దీంతో ఒకేరోజు.. అటు తెలంగాణ విమోచన దినోత్సవం.. ఇటు హైదరాబాద్‌ నగరంలో పోటాపోటీగా కాంగ్రెస్‌, బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో.. రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి రేపుతుంది. ఇరు పార్టీలు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించే ఛాన్స్ ఉంది. అయినప్పటికీ.. పరస్పర విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News