ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. గాలి నిప్పు నీరు భూమి ఇలా అన్ని కలుషితం అవుతున్నాయి. వాతావరణంలో ప్రతికూల మార్పులు ఏర్పుడుతున్నాయి. మారుతున్న మార్పుల కారణంగా మానవ జీవన ప్రమాణం తగ్గిపోతుంది. ఇక పక్షి జాతులు అయితే ఏకంగా తుడిచిపెట్టుకుపోతుందనే చెప్పచు. ప్రపంచవ్యాప్తంగా పక్షి జాతి అంతరించిపోవడానికి మానవ కార్యకలాపాలే ప్రధాన కారణమని శాస్ర్తవేత్తల అధ్యయనంలో బయటపడుతోంది. దాంతోపాటు పర్యావరణపరమైన సవాళ్లు పక్షుల మనుగడపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గడచిన 30 ఏళ్లలో మన దేశంలో 338 పక్షి జాతులకు సంబంధించిన పక్షుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. 942 పక్షి జాతులపై అధ్యయనం చేయగా వాటిలో సుమారు 204 జాతులు లేకుండా పోయాయి.
పక్షులు అంతరించిపోవడానికి మానవ కారణాలే కారణమని సైంటిస్టులు చెబుతున్నారు. వాటిలో ప్రధానంగా పెరిగిన మానవ జనాభా, వాతావరణ మార్పు, నివాస విధ్వంసం (నివాసం, లాగింగ్, జంతువులు మరియు ఒకే పంటల వ్యవసాయం మరియు ఆక్రమణ మొక్కల అభివృద్ధి ద్వారా), పక్షుల అక్రమ రవాణా, గుడ్డు సేకరణ, కాలుష్యం (ఎరువులలో) స్థానిక మొక్కలు మరియు వైవిధ్యంపై ప్రభావం చూపడం ఉన్నాయి. అలాగే పురుగుమందులు, కలుపు సంహారకాలు నేరుగా వాటిపై ప్రభావం చూపుతున్నాయి. అలాగే పక్షులకు అవసరమైన ఆహారం లభించకపోవడం కూడా పక్షి జాతులు తరగిపోవడానికి కారణంగా కనిపిస్తున్నాయి. పక్షులు అంతరించిపోవడానికి పర్యావరణపరమైన సవాళ్లు పక్షుల మనుగడపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
గడచిన 30 ఏళ్లలో మన దేశంలో అధ్యయనం చేసిన 338 పక్షి జాతుల్లో 60 శాతం సంఖ్యాపరంగా తగ్గిపోయాయి. 13 ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు దేశవ్యాప్తంగా అధ్యయనం చేశాయి. అధ్యయన సంస్థలు 30,000 మంది పక్షి ప్రేమికులు అందించిన సమాచారాన్ని విశ్లేషించి పక్షుల మనుగడ లేకుండా పోవడానికి కారణాలు బయటపెడుతున్నాయి. 942 పక్షి జాతులను అధ్యయనం చేసిన మీదట 338 జాతులకు సంబంధించి దీర్ఘకాలిక ధోరణులను నిర్ధారించగలిగారు. వీటిలో 204 జాతుల సంఖ్య తగ్గిపోగా, 98 జాతులు స్థిరంగా ఉన్నాయి. 36 జాతుల సంఖ్య పెరిగింది.
కొన్ని పక్షి జాతుల సంఖ్య పెరగడానికీ, మరికొన్ని తగ్గడానికీ మధ్య సంబంధం ఏమిటనేది శాస్త్రవేత్తలు ఇంకా తేల్చలేదు. బట్టమేక పక్షి, తెల్ల పొట్ట హెరాన్, బెంగాల్ ఫ్లోరికాన్, ఫిన్స్ వీవర్ పక్షులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయనీ, వాటి రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధ్యయన కర్తలు హెచ్చరించారు. పచ్చిక బయళ్లు, చిత్తడి నేలలు, వనాలలో తిరిగే పక్షుల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. అన్నిరకాల ఆహారాన్ని తినే పక్షులు, పండ్లు, పుష్ప మకరందాలను తినే పక్షుల సంఖ్య తగ్గుతున్నా, వాటికన్నా మాంసాహారాన్ని, పురుగులనూ తినే పిట్టల సంఖ్య మరింత వేగంగా క్షీణిస్తోంది. వ్యవసాయంలో ఎరువులు, క్రిమినాశనుల వాడకం ఎక్కువ అవడం పక్షుల ఉనికికి ముప్పు తెస్తోందని ఐరోపా అధ్యయనాలు సూచించాయి.
భారత్‌లో జరిగిన తాజా అధ్యయనంప ప్రకారం కూడా విషతుల్య పదార్థాలను తినడం వల్ల పక్షుల సంఖ్య తగ్గిపోతోందని నిర్ధారించింది. పశ్చిమ కనుమలు, శ్రీలంక మధ్య వలస వెళ్లే పక్షుల విషయంలో ఈ తరుగుదల తీవ్రంగా కనిపిస్తోంది. అడవులు అంతరించిపోవడం అక్కడ జీవించే పక్షులకు ప్రాణాంతకమైంది. చిత్తడి నేలలు తరిగిపోవడం బాతుల ఉనికిని దెబ్బతీస్తోంది. భారత్‌లో పట్టణ విస్తరణ, టేకు చెట్ల మాదిరిగా ఒకే తరహా వృక్ష వనాల పెంపకం, మౌలిక వసతుల విస్తరణ పక్షిజాతులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 11,154 పక్షి జాతులలో, 159 జాతులు పూర్తిగా అంతరించిపోయాయి మరో 226 జాతులు క్రమంగా అంతరించిపోతున్నాయి, 1,018 జాతులు అంతరించే దశలో ఉన్నాయి.