Monday, December 23, 2024
Home ఆంధ్రప్రదేశ్ Big Relief to Bandaru Satyanarayana: బండారు సత్యనారాయణకు బెయిల్ మంజూరు

Big Relief to Bandaru Satyanarayana: బండారు సత్యనారాయణకు బెయిల్ మంజూరు

by Mahadev
0 comment 46 views
BANDARU SATYANARAYANA ARREST

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి(Former Minister Bandaru Satyanarayana Murthy)కి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. రూ.25 వేల పూచీకత్తుతో మొబైల్‌ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(Chief Minister YS Jaganmohan Reddy), మంత్రి ఆర్‌కే రోజాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణపై గుంటూరు జిల్లా ఆరండల్ పేట్, నగర పాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక కేసు, మంత్రి ఆర్‌కే రోజాపై వ్యాఖ్యలు చేసినందుకు మరో కేసు నమోదు చేశారు పోలీసులు. 400/2023, 41 (A), 41(B),153, 294, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

టీడీపీ సీనియర్ నేత బండారు(Senior TDP leader Bandaru) వ్యాఖ్యలపై ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేందుకు పోలీసులు గుంటూరు నుంచి మంగళవారం తెల్లవారుజామున అనకాపల్లి జిల్లా వెన్నెలపాలం వెళ్లారు. చాలా సేపు నోటీసులు తీసుకోకుండా బండారు తలుపు గడియ పెట్టుకున్నారు. ఎట్టకేలకు తలుపులు బ్రేక్‌ చేసి బండారును ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి బండారును గుంటూరు తీసుకెళ్లారు. ఆసుపత్రి వద్ద లాయర్లను అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. వైద్యులు ఆయనకు వైద్యపరీక్షలు చేశారు. బీపీ ఎక్కువ ఉండటంతో బండారును ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలని వైద్యులు సూచించారు. సీఎం జగన్, మంత్రి రోజా మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గుంటూరులో రెండు కేసులు నమోదు చేశారు.

దీంతో బండారు సత్యనారాయణ లాయర్‌ హైకోర్టును ఆశ్రయించారు. బండారు సత్యనారాయణను అక్రమంగా నిర్బంధించారని పిటిషన్​లో పేర్కొన్నారు. రెండు కేసుల్లో 41ఏ నోటీసులు ఇచ్చారని, 41ఏ నోటీసులు ఇచ్చి ఎలా అరెస్టు చేస్తారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు. తాము నోటీసులు ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలీసుల విధానంపై వివరాలతో కౌంటర్ వేయాలని పిటిషనర్‌కు ఆదేశించారు. విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.

నందమూరి, నారా కుటుంబాలపై వైసీపీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రెండు రోజుల కిందట మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రోజాపై ఘాటు విమర్శలు చేశారు. ‘ఎన్టీఆర్ కుటుంబంపై, భువనేశ్వరి, బ్రాహ్మణీలపై మాట్లాడే అర్హత నీకు లేదు. రోజా… నువ్వు సినిమాల్లో ఎలా నటించావో నాకు తెలుసు. నీ చరిత్ర ఎవరికి తెలియదు. నీ బాగోతం బయటపెడితే నీ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటారు. ఇవాళ నీతి సూత్రాలు, ప‌తివ్రత కామెంట్స్ చేస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ వ‌ద్ద నీ పూర్తి బండారం ఉంద‌న్నారు.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News