స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్(SKILL DEVELOPMENT SCAM) కేసు(CASE)లో అరెస్ట్ అయిన టీడీపీ చీఫ్(TDP CHIEF) నారా చంద్రబాబునాయుడు(NARA CHANDRABABU NAIDU) రాజమండ్రి సెంట్రల్ జైలు(RAJAHMUNDRY CENTRAL JAIL)లో జ్యుడిషియల్ రిమాండ్(JUDICIAL REMAND)లో ఉన్న విషయం విదితమే కాగా.. ఈ రోజు తన కుటుంబ సభ్యులతో ములాఖత్ అయ్యారు. జైలులో ఉన్న చంద్రబాబును నారా లోకేష్(NARA LOKESH), భువనేశ్వరి(BHUWANESHWARI), బ్రహ్మణి(NARA BRAHMANI)లు కలిశారు. చంద్రబాబుతో మాట్లాడేందుకు వారికి 45 నిమిషాల పాటు సమయం ఇచ్చారు అధికారులు. జైలులో ఉన్న ఆయన యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. ఇతర అంశాలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది.. అయితే, ములాఖత్ తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భావోద్వేగానికి గుర్యారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ అభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు భువనేశ్వరి.. చంద్రబాబుకు ముందు ప్రజలు.. తర్వాత కుటుంబమన్న ఆయన.. జైలులో కూడా ప్రజల గురించే ఆలోచన చేస్తున్నారని తెలిపారు.. వాళ్లు చెబుతున్నా.. ఆయన భద్రతపైనే మాకు భయం ఉందన్నారు.. జైలులో అన్ని సౌకర్యాలు కల్పించామని చెబుతున్నా.. సరైన సౌకర్యాలు లేవన్నారు భువనేశ్వరి.. ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. చంద్రబాబు స్నానం చేయడానికి చన్నీళ్లు ఇస్తున్నారన్నారు.. చంద్రబాబును చూసి జైలు నుంచి బయటకు వస్తుంటే.. నాలో సగ భాగాన్ని వదిలేసి వస్తున్నట్టు అనిపించిందంటూ ఎమోషనల్ అయ్యారు.. ఆయన ఆధునీకరణ చేసిన జైలులోనే చంద్రబాబును ఖైదీగా పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు నారా భువనేశ్వరి.