Monday, December 23, 2024
Home జాతీయం Bharat Drone Shakti 2023 Exhibition : వాయుసేనలోకి మరో పవర్​ఫుల్ విమానం.

Bharat Drone Shakti 2023 Exhibition : వాయుసేనలోకి మరో పవర్​ఫుల్ విమానం.

by స్వేచ్ఛ
0 comment 54 views
Bharat Drone Shakti 2023 Exhibition

స్పెయిన్‌(SPAIN)కు చెందిన ఎయిర్‌ బస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌(AIRBUS DEFENCE AND SPACE) సంస్థ తయారు చేసిన సీ295 వ్యూహాత్మక సైనిక రవాణా విమానాన్ని(MILTARY TRANSPORT AIRPLANE) భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టారు. భారత వైమానిక దళ సామర్థ్యాన్ని ఆధునికీకరించే లక్ష్యంతో రెండేళ్ల క్రితం 21 వేల 935 కోట్లతో 56 సీ-295 రవాణా విమానాల కొనుగోలుకు ఒప్పందం జరిగింది. అందులో భాగంగా తయారైన తొలి విమానం ఇప్పుడు భారత వైమానిక దళంలో చేరింది. ఘజియాబాద్‌(GHAJIYABAD)లోని హిండన్‌ ఎయిర్‌బేస్‌లో అధికారికంగా భారత వాయుసేనలోకి దీన్ని ప్రవేశపెట్టారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(RAJNADH SINGH) సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హ్యాంగర్‌ వద్ద సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు.

ఒప్పందంలో భాగంగా 2025 నాటికి.. ఫ్లై అవే కండీషన్‌లో ఉన్న 16 విమానాలను(16FLIGHTS) ఎయిర్‌ బస్‌ డెలివరీ చేయనుంది. మిగిలిన 40 విమానాల అమరిక, తయారీ భారత్‌లోని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌లో జరుగుతుంది. ఇందుకోసం రెండు కంపెనీల మధ్య ఒప్పందం ఖరారైంది. గతేడాది అక్టోబరులో వడోదరలో సీ-295 విమానాల తయారీ కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ప్రైవేట్‌ కన్సార్టియం ద్వారా తయారయ్యే మొదటి సైనిక విమానం ఇది. భారత వైమానిక దళంలో ఆరు దశాబ్దాల కిందట అవ్రో-748 విమానాలను ప్రవేశపెట్టారు. వాటిని సీ-295 విమానాలతో భర్తీ చేయనున్నారు.

5 నుంచి 10 టన్నుల బరువును మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్‌ 71 మంది సైనికులు లేదా 50 మంది పారాట్రూపర్లను వ్యూహాత్మక ప్రాంతాలకు తరలించగలదు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న భారీ విమానాలు చేరుకోలేని ప్రదేశాలకు సైతం లాజిస్టిక్ కార్యకలాపాలు సాగించగలదు. ఈ విమానం ప్రత్యేక మిషన్లతోపాటు విపత్తు ప్రతిస్పందన, సముద్ర గస్తీ విధులను నిర్వహించగలదు. భారత వైమానిక దళానికి చెందిన ఆరుగురు పైలట్లు, 20 మంది సాంకేతిక నిపుణులు ఇప్పటికే సివిల్లెలో ఈ విమానం నడిపేందుకు శిక్షణ పూర్తి చేసుకున్నారు.

కాగా.. భారత వాయుసేన, డ్రోన్‌ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఏర్పాటు చేసిన.. భారత్ డ్రోన్ శక్తి-2023 ప్రదర్శనను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొన్ని డ్రోన్ల విన్యాసాలను రాజ్‌నాథ్ సింగ్, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ కలిసి వీక్షించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కూడా పరిశీలించారు. 50 నుంచి 100 కిలోల బరువైన పేలోడ్లను మోసుకుని వెళ్లే డ్రోన్లను రక్షణమంత్రి, వాయుసేన అధిపతి పరిశీలించారు. శత్రువులపై దాడులు చేయగల కమికజే సైనిక డ్రోన్లను పనితీరును సైతం వీక్షించారు. అలాగే మోటార్​ బైక్​లపై నుంచి కిసాన్ డ్రోన్​లను ఆపరేట్ చేయడాన్ని రాజ్​నాథ్​ సింగ్ పరిశీలించారు

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News