చాలా మంది విహార యాత్రల పేరుతో వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. మరికొంతమంది ఉద్యోగాల రీత్యా, సందర్శనల పేరుతో విదేశాలకు వెళ్తుంటారు. అప్పుడు ఆ ప్రాంతాల్లో ఉండే రుచికరమైన వంటకాలను రుచి చూడాలని మనసు తహతహలాడుతుంది. కానీ.. ఆ రెస్టారెంట్లలో ఉండే ధరలను చూసి వెనకడుగు వేస్తుంటారు. అయితే.. ప్రత్యేకంగా భోజనం కోసమే క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తున్నాయి బ్యాంకులు. ఇందులో ఉత్తమ క్రెడిట్ కార్డులు ఏవి..? డిస్కౌంట్ ఎంత వస్తుంది..? ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? వంటి వివరాలను ఇక్కడ చూద్దాం.
హెచ్‌డీఎఫ్‌సీ రెగాలియా క్రెడిట్ కార్డ్
ఈ కార్డుకు వార్షిక రుసుము రూ.2,500 చెల్లించాలి. సంవత్సరం కాలం పాటు జొమాటో గోల్డ్ సభ్యత్వం లభిస్తుంది. ఫుడ్ ట్రైల్ డైనింగ్ ప్రోగ్రామ్ ఆఫర్లు ఉంటాయి. భాగస్వామితో వారాంతాల్లో గడిపే ఫైన్ డైనింగ్‌పై 40శాతం డిస్కౌంట్ ఉంటుంది. వారంలో అన్ని రోజులూ ప్రీమియం డైనింగ్‌పై 20శాత తగ్గింపు లభిస్తుంది. చెఫ్ ప్రత్యేక రెస్టారెంట్లలో 30శాతం తగ్గింపు ఉంటుంది. డిన్నర్ బఫేలపై 25శాతం తగ్గింపు లభిస్తుంది. వివిధ కేటగిరీలపై వెచ్చించే ప్రతి 150 రూపాయలకు 4 రివార్డ్ పాయింట్‌లు లభిస్తాయి.
ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్..
ఈ కార్డుకు వార్షిక రుసుము రూ2,999 చెల్లించాలి. త్రైమాసికానికి రూ.50,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే రూ.1,000 పిజ్జా హట్ ఈ-వోచర్‌లు వస్తాయి. భోజన కార్యకలాపాలకు ఖర్చు చేసే ప్రతి రూ.100కి 10 రివార్డ్ పాయింట్‌లు వస్తాయి. వినియోగదారుని పుట్టినరోజున ఖర్చు చేసే ప్రతి రూ.100కి 20 రివార్డ్ పాయింట్‌లు వస్తాయి.
కోటక్ డిలైట్ ప్లాటినం క్రెడిట్ కార్డ్
ఈ కార్డుకు వార్షిక రుసుము రూ.1,999 చెల్లించాలి. డైనింగ్, సినిమాలు, ప్రయాణంపై 10శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. భోజనం రూ.600పైగా ఉంటే క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ప్లాటినం ట్రావెల్ క్రెడిట్ కార్డ్
ఈ కార్డుకు వార్షిక రుసుము రూ.3,500 చెల్లించాలి. భాగస్వామితో కలిసి రెస్టారెంట్‌కు వెళ్తే.. 15-20శాతం తగ్గింపు ఉంటుంది. ఖర్చు చేసే ప్రతి రూ.50కి 1 మెంబర్‌షిప్ పాయింట్ లభిస్తుంది.సభ్యులకు కాంప్లిమెంటరీ పాస్ దక్కుతుంది.
స్టాండర్డ్ చార్టర్డ్ అల్టిమేట్ క్రెడిట్ కార్డ్
ఈ కార్డుకు వార్షిక రుసుము రూ.5,000 చెల్లించాలి.దేశంలోని టాప్ 250 రెస్టారెంట్లలో భోజనానికి 25శాతం తగ్గింపు ఉంటుంది.కార్డ్ హోల్డర్ల కోసం కాంప్లిమెంటరీ టేబుల్ బుకింగ్ సేవలు ఉంటాయి.100కి పైగా గ్లోబల్, డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్ ఉంటుంది.
.