సొంత ఇల్లు కట్టుకోవాలనేది ప్రతీ ఒక్కరికి స్వప్నం. ఈ కల వాస్తవ రూపం దాల్చడానికి అందరికీ ఎదురయ్యే మొదటి ఇబ్బంది డబ్బు సర్దుబాటు. ఇలాంటి వారికోసమే.. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు గృహ రుణాలు అందిస్తుంటాయి. అనివార్య పరిస్థితుల్లో చాలా మంది గృహ రుణాలు తీసుకుంటున్నారు. మరి, అతి తక్కువ వడ్డీ రేట్లతో.. హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఏవో..? ఎంత మొత్తం వడ్డీ వసూలు చేస్తున్నాయో మీకు తెలుసా??
హెచ్డీఎఫ్సీ
ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకు.. హెచ్డీఎఫ్సీ తమ వినియోగదారులలో హోమ్ లోన్స్ కావాలనుకునే అర్హులైన రుణగ్రహీతలకు చాలా తక్కువ వడ్డీరేటుతో గృహ రుణాలు ఇస్తోంది. ఈ బ్యాంకులో హోమ్ లోన్లపై కనీస వడ్డీరేటు 8.5శాతంగా ఉండగా.. గరిష్ఠంగా 9.85శాతం వరకు ఉంది. అదనంగా ఈ లోన్ల కోసం అనుబంధిత ప్రాసెసింగ్ ఫీజులు గరిష్ఠంగా 3వేల నుంచి 5వేల వరకు ఉన్నాయి. సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి హెచ్డీఎఫ్సీ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోందనేది నిపుణుల అభిప్రాయం.
ఇండస్‌ఇండ్ బ్యాంకు
ఇండస్‌ఇండ్ బ్యాంకు హోమ్ లోన్స్‌పై 8.5% నుంచి 9.75% వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, పొడిగించిన రీపేమెంట్ కాలపరిమితి.. వినియోగదారులకు మంచ ఆప్షన్ గా ఉంది.ఇండియన్ బ్యాంకు : పైన పేర్కొన్న బ్యాంకుల మాదిరిగానే ఇండియన్ బ్యాంకు కూడా ఆర్షణీయమైన గృహ రుణాలను అందిస్తోంది. ఈ బ్యాంక్‌లో హోమ్ లోన్స్‌పై ప్రారంభ వడ్డీ రేటు 8.5% ఉండగా.. గరిష్ఠ వడ్డీ రేటు 9.9%గా ఉంది.-పేమెంట్ నిబంధనలను కూడా సౌకర్యవంతంగానే ఉంటాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంకు
రెండవ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా పోటీతత్వ హోమ్ లోన్ ఆఫర్‌లతో గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. ఈ బ్యాంకులో ప్రారంభ వడ్డీ రేటు 8.6% ఉండగా.. గరిష్ఠ వడ్డీరేటు 9.45%గా ఉంది. PNB సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి సరసమైన ఫైనాన్సింగ్ ఎంపికలను అందిస్తోంది. రుణగ్రహీతలకు అనుకూలమైన నిబంధనలను రూపొందించింది. రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య నిధులను లోన్ల రూపంలో అందిస్తోంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
ఈ బ్యాంక్ కూడా తక్కువ వడ్డీ రేట్లకే లోన్స్ అందిస్తోంది. 8.6% నుంచి 10.3% వరకు విస్తృతమైన గృహ రుణ వడ్డీ రేట్లను ఈ బ్యాంకు అందిస్తోంది. ముఖ్యంగా మంచి రుణ నిబంధనలను పొందడం అనేది క్రెడిట్ స్కోర్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని ఈ బ్యాంకు వినియోగదారులకు చెబుతోంది. ఎంత మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే, బ్యాంకులు మీకు అంతగా ఎక్కువగా రుణాలు ఇచ్చే అవకాశం ఉందని కస్టమర్లకు సూచిస్తోంది.