పుష్ప సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అనౌన్స్ చేసినప్పటి నుంచి అల్లు అర్జున్ మీద ప్రశంసల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఇంటికి వరుసగా సినీ ప్రముఖులు క్యూ కట్టారు. నేరుగా అల్లు అర్జున్ ని కలుసుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు కూడా వారంతా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అందరూ తన ఇంటికి వస్తుంటే అల్లు అర్జున్ మాత్రం స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఇంటికి వెళ్లి దాదాపు గంటన్నర సమయం అక్కడే గడిపారు.
అసలు విషయం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం బ్రహ్మానందం రెండో కుమారుడు వివాహం హైదరాబాదులో గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహానికి తెలుగు సినీ పరిశ్రమ పెద్దలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అనేకమంది రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు. ఈ వివాహానికి అల్లు అర్జున్ కూడా హాజరు కావాల్సి ఉంది కానీ ఆయన పలు కారణాలతో హాజరు కాలేదు.
దీంతో బ్రహ్మానందం ఇంటికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి వారితో పాటు బ్రహ్మానందంతో కూడా సమయం గడిపారు. ఇక తమ ఇంటికి అల్లు అర్జున్ ఇక ఈ సందర్భంగా బ్రహ్మానందం సహ కుటుంబ సభ్యులందరూ అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు అనౌన్స్ చేసినందుకుగాను శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మరో పక్క సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మీద ప్రశంశల వర్షం కురుస్తోంది. పుష్ప సినిమాకి గాను ఆయనకు నేషనల్ అవార్డు లభించడంతో ఆయన అభిమానులే కాదు తెలుగు సినీ అభిమానులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.