మిరియాలు… మసాలా దినుసుల రారాజుగా మిరియాలను చెబుతారు. మిరియాలను సరిగా ప్రతీరోజూ ఆహారంలో వాడితే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు. ఆహారం రుచిని పెంచడమే కాకుండా బోలెడన్ని ఔషధ గుణాలతో మిరియాలు ఆరోగ్యాన్ని కాపాడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.
మిరియాలలో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉంటాయి. విటమిన్ సి, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ కె, ఐరన్, కాపర్, మాంగనీస్ లతో మిరియాలు కూడుకొని ఉంటాయి. అయితే మిరియాలు అతిగా తీసుకున్నా అనేక ఇబ్బందులు వస్తాయి. ప్రతీరోజూ పరిమితంగా మిరియాలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మిరియాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం ఎంతో మంచిది. టైప్ టు డయాబెటిస్ తో బాధపడేవారు మిరియాలు ఆహారంలో భాగంగా తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. మిరియాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడు నియంత్రణలో ఉంటాయి. మిరియాలు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
నరాల సమస్యలు ఉన్నవారు మిరియాలను ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిది. మిరియాలను ఆహారంలో భాగంగా తినడం వల్ల మీ పొట్టకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. జీర్ణాశయ వ్యవస్థకు మిరియాల కారణంగా మేలు జరుగుతుంది. మిరియాలు జీర్ణక్రియను ఎంతో బాగా మెరుగుపరుస్తాయి. శరీర మెటబాలిజంను మిరియాలు పెంచుతాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందించి మనల్ని ఆరోగ్యంగా ఉండేలా మిరియాలు చేస్తాయి. మిరియాలు రోజు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఆర్థరైటిస్ తో బాధపడేవారు మిరియాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. మిరియాలు వైరల్ ఫీవర్ లను, గొంతు నొప్పి, జలుబు వంటి వాటిని తగ్గిస్తాయి. మిరియాలు యాంటీసెప్టిక్ గా కూడా ఉపయోగపడతాయి. ఇన్ని ప్రయోజనాలున్న మిరియాలను ఆహారంలో భాగంగా చేసుకోండి. అనేక అనారోగ్య బాధల నుండి బయటపడండి.