బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయని, లెక్కలు బాగా వస్తాయని పెద్దలు అంటుంటారు. తెలుగునేలనే కాకుండా దేశమంతటా విస్తృతంగా రోజువారీ ఆహారంలో కనిపించే కూరగాయల్లో బెండకాయ ఒక్కటి. బెండకాయలో విటమిన్లు, ఖనిజాలు, పీచు మాత్రం పుష్కలంగా దొరుకుతాయని పోషక నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నో పోషకాలకి నెలవైన బెండకాయను ప్రపంచవ్యాప్తంగా ఉండే ఉష్ణ మండల ప్రాంతాల్లో విరివిగా ఉపయోగించడంతో పాటు సాగు చేస్తారు. బెండకాయ జన్మస్థలం అగ్ర దేశం అమెరికా ఉష్ణ మండల ప్రాంతం. బెండకాయను ఆహారంగానే కాకుండా పలు రకాల ఔషధాల తయారీ, నార పరిశ్రమలోనూ ఉపయోగిస్తారు. మన దేశంలో బెండ సాగు ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు.
పోషకాల నెలవు బెండ:
బరువు తగ్గాలనుకునే వారికి బెండను మించిన ప్రత్యామ్యాయం లేదు. దీనిలోని జిగురు, పీచుకు రక్తంలో చక్కెర నిల్వలను సమపాళ్లలో ఉంచే శక్తి ఉంది. బెండలో అధికంగా ఉండే నీటి మూలంగా మలబద్దకం, తేపులు, కడుపుబ్బరం, ఎసిడిటీ తదితర సమస్యలు దూరమవుతాయి. బెండకాయ గింజల్లోని నూనె, ప్రోటీన్‌ను అత్యుత్తమ తరగతి ప్రోటీన్‌గా గుర్తింపు పొందింది.
బెండకాయలోని కేలరీ కౌంట్ (ప్రతి 100గ్రాముల బెండకాయల్లో)
పేగుల పని తీరు, కదలికలను మెరుగు పర్చటంలో బెండ చక్కగా పని చేస్తుంది. ఇందులోని విటమిన్ సి కారణంగా శ్వాసకోశ సమస్యలు దరిచేరవు. దీనిలోని ఫోలిక్ ఆమ్లం గర్భిణీలకు ఎంతగానో మేలు చేస్తుంది. బెండకాయ తినే అలవాటు ఉన్నవారి చర్మం మృదువుగా ఉండటంతో పాటు మొటిమలు రాకుండా కాపాడుతుంది. దీని రసం చర్మానికి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది.
ఎనర్జీ – 33 కిలో కేలరీలు
కార్బోహైడ్రేట్స్ – 7.5 గ్రాములు
షుగర్స్ – 1.48 గ్రాములు
పీచు – 3.1 గ్రాములు
కొవ్వు – 0.19గ్రాములు
ప్రొటీన్ – 2 గ్రాములు
విటమిన్ బీ1 – 0.2 మిల్లీ గ్రాములు
విటమిన్ సి – 23 మిల్లీ గ్రాములు
విటమిన్ ఇ – 0.27 మిల్లీ గ్రాములు
కాల్షియం – 82 మిల్లీగ్రాములు
ఐరన్ – 0.61 మిల్లీగ్రాములు
మెగ్నీషియం – 57 మిల్లీగ్రాములు
పొటాషియం – 299 మిల్లీ గ్రాములు
జింక్ – 0.58 మిల్లీగ్రాములు