కివి విటమిన్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మరియు ఫైబర్ వంటి బహుళ పోషకాలతో నిండి ఉంది. మీరు ప్రతిరోజూ ఒకటి తింటే మీరు పొందగల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు క్రింద ఉన్నాయి. కివి, చిన్న నల్లటి గింజలు కలిగిన ఒక శక్తివంతమైన ఆకుపచ్చ పండు. కివిని ఒక సూపర్ ఫుడ్ గాచెప్పవచ్చు. దీనిలో ఫైబర్‌తో అధికంగా ఉంటుంది., కరిగే, కరగని రెండు ఫైబర్లు ఉంటాయి. అంతేకాకుండా విటమిన్లు ఏ, బీ6, బీ12, ఈ, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి బహుళ పోషకాలు కివిని తీసుకోవటం ద్వారా శరీరానికి అందుతాయి. రక్తహీనతను అధిగమించడంలో సహాయపడుతుంది. తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. సుమారు 70 గ్రాముల ఒక పండు 40 కేలరీలను ఇస్తుంది. ప్రతిరోజు ఒక కివి పండును తీసుకోవటం ద్వారా లభించే 5ప్రయోజనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఇది ఫ్లూ వంటి అసంఖ్యాక ఇన్ఫెక్షన్ల నుండి మన్నల్ని కాపాడుతుంది. కివి విటమిన్ సిని అధిక పరిమాణంలో కలిగి ఉంటుంది, ఒక పండు మీ రోజువారీగా శరీరానికి కావాల్సిన విటమిన్ సి మొత్తం అవసరాలను అందిస్తుంది. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మంచి యాంటీబాడీ పనితీరు అవసరం. అలాగే సెరోటోనిన్ ఉత్పత్తికి సి చాలా ముఖ్యమైనది, కాబట్టి కివి తినడం మన మానసిక స్థితిని మెరుగుపడుతుంది.
కివి డెంగ్యూ ను ఎదుర్కోవటంలో బాగా ఉపకరిస్తుంది. డెంగ్యూ సమయంలో ప్లేట్‌లెట్స్ తగ్గటం అనేది చాలా ఆందోళన కలిగిస్తుంది. మన ప్లేట్‌లెట్స్ సంఖ్యను మెరుగ్గా పెంచటానికి సహాయపడే విటమిన్ సితో పాటు, కివీ జీర్ణప్రక్రియను వేగవంతం చేస్తుంది. యాంటీఆక్సిడెంట్‌లు, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సర్పొ టాషియం ఇందులో సమృద్ధిగా ఉంటాయి, డెంగ్యూ వచ్చిన సమయంలో తినడానికి అనువైన ఆహారంగా చేస్తాయి. విటమిన్ సి మనం తినే ఆహారం నుండి ఐరన్ ను మరింత సమర్థవంతంగా గ్రహించడంలో సహాయపడుతుంది. విటమిన్ బీ9 (ఫోలేట్) ను అందిస్తుంది, ఈ రెండూ రక్తంలో ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడతాయి.
కివీఫ్రూట్‌లో అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి ఫ్రీ రాడికల్స్, ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు, తినే జంక్ కారణంగా శరీరంలో ఉత్పత్తి అయ్యే హానికరమైన వాటి నుండి రక్షించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి, కివి ఒత్తిడిని తగ్గించటంలో కూడా సహాయకారిగా పనిచేస్తుంది.
కివిలోని విటమిన్ సి, పాలీఫెనాల్స్ , పొటాషియం అన్నీ గుండెకు ఎంతో మంచి చేస్తాయి. రక్త నాళాలు , గుండెను రక్షించడానికి,రక్తంలో కొవ్వుల అనగా ట్రైగ్లిజరైడ్స్మొ త్తాన్ని తగ్గించటంలో తోడ్పడతాయి. శరీరంలో వేడిని తగ్గించటంలో తోడ్పడుతుంది.
అందంగా కనిపించే చర్మం కోసం శరీరంలో మంచి పీహెచ్ బ్యాలెన్స్ తప్పనిసరి. కివి ప్రకృతిలో ఆల్కలీన్ కాబట్టి మనం తినే ఆమ్ల ఆహారాల ప్రభావాలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. అదనంగా, కివిలోని సి చర్మంలో కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. ఇది చర్మం, కండరాలు, ఎముకల పఠిష్టతకు తోడ్పడుతుంది.