సీజన్ తో సంబంధం లేకుండా ఏ సీజన్ లో అయినా అందుబాటులో ఉండే గ్రీన్ వెజిటేబుల్ కుకుంబర్., మనం చల్లటి ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతాము. అందుకని, అత్యంత రిఫ్రెష్ చేసే కీరదోసకాయను సలాడ్స్ లో ఎక్కువగా ఉపయోగించి తీసుకుంటుంటారు, దోసకాయను అందరూ పండు, కూరగాయగా అని పిలుస్తుంటారు. ఈ కీరదోసకాయను ఎలా పిలిచినా ఇందులో ఉండే ప్రయోజనాలు మాత్రం వెలకట్టలేనివి. శరీరాన్ని చల్లబరచడం నుండి మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వరకు, దోసకాయ మీకు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. భారతదేశంలో దోసకాయను సలాడ్లు మరియు పానీయాలలో మాత్రమే కాకుండా రైతా, కూరల రూపంలో కూడా ఉపయోగిస్తారు. దోసకాయను ప్రతి దేశంలోనూ వారికి ఇష్టమైన రీతిలో తయారుచేసుకుని తింటారు.
కీరదోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల , ఇది బాగా ప్రాచుర్యం పొందింది. మనలో చాలా మంది దోసకాయను యధాతథంగా తినడానికి ఇష్టపడతారు. దోసకాయ పొట్టు తీయకుండా తింటే మంచిదా? ఇది శరీరానికి సమస్యలను కలిగిస్తుందా? పొట్టును తొలగించి తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఈ కథనంలో తెలుసుకోండి.
పోషకాహారం సమృద్ధిగా ఉంటుంది దోసకాయలలో నీరు పుష్కలంగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని చల్లబరుస్తుంది. దోసకాయలో కొన్ని ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఒక దోసకాయలో కేవలం 30 కేలరీలు మాత్రమే ఉంటాయి, సున్నా కొవ్వుతో పాటు ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలతో నిండి ఉంటుంది. దోసకాయ విటమిన్ కే యొక్క గొప్ప మూలం, ఇది రోజువారీ విలువలో 57% అందిస్తుంది. విటమిన్ కే రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
కీరదోసకాయలోని లిగ్నన్స్ ఆస్టియోపోరోసిస్, గుండె జబ్బులను, కొన్ని క్యాన్సర్‌లను నివారిస్తుంది. ఎక్కువ పోషకాలు దోసకాయలోని బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి మరియు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడంలో సహాయపడతాయి. దోసకాయలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్నాయని, కొన్ని విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో తక్కువ క్యాలరీలు, నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కీరదోసకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుంది. ఎక్కువ డిమాండ్ ఉన్న కూరగాయ కావడంతో ఆ డిమాండ్ కు తగ్గట్టుగా రసాయనాలు పిచికారీ చేసి పండిస్తున్నారు. రసాయనాలు స్ప్రే చేసి పొట్టుతో పెరిగిన దోసకాయలను తినడం అనారోగ్యకరం.
అందువల్ల, దోసకాయలు పొట్టులో రసాయనాలు, మురికిని కలిగి ఉండే అవకాశం ఉన్నందున, వాటిని పొట్టు లేదా పై తొక్కతో తినకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. దోసకాయ అనేది భారతీయ సలాడ్లలో ఉపయోగించే చాలా ముఖ్యమైన కూరగాయ. దోసకాయ ముక్కలు లేకుండా కూరగాయల సలాడ్‌ను ఊహించలేము. వేసవి రోజుల్లో, దోసకాయను నాలుగు ముక్కలుగా చేసి, ఉప్పు, కారం కలిపి చిరుతిండిగా తింటారు. దోసకాయ పెరుగు రైతా ఉత్తర భారతీయ వంటకాలలో అత్యంత ప్రసిద్ధి చెందినది.